Share News

అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం

ABN , Publish Date - May 22 , 2026 | 09:24 PM

స్వల్పశ్రేణి లక్ష్యాలను ఛేదించే అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణ పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరంలోని చాందీపూర్‌లోనున్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి వ్యూహాత్మక దళాల కమాండ్ (ఎస్ఎఫ్‌సీ) ఆధ్యర్వంలో శుక్రవారంనాడు ఈ క్షిపణ పరీక్ష జరిగింది.

అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
Agni-1 ballistice missile

చాందీపూర్: స్వల్పశ్రేణి లక్ష్యాలను ఛేదించే అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణ పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరంలోని చాందీపూర్‌లోనున్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి వ్యూహాత్మక దళాల కమాండ్ (ఎస్ఎఫ్‌సీ) ఆధ్యర్వంలో శుక్రవారంనాడు ఈ క్షిపణ పరీక్ష జరిగింది.


ఉపరితలం నుంచి ఉపరితలం పైకి దాడి చేసే స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్షను ఎస్ఎఫ్‌సీ విజయవంతంగా ప్రయోగించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షతో అన్ని కార్యాచరణ, సాంకేతిక పరిమితులను విజయవంతంగా ధ్రువీకరించినట్టు పేర్కొంది.


గత ఏడాది జూలైలోనూ ఇదేతరహా పరీక్షను డీఆర్‌డీఓ విజయవంతంగా నిర్వహించింది. ఈ క్షిపణి 700 నుంచి 1,200 కిలోమీటర్ల లక్షాలను సునాయాసంగా ఛేదించగలదు. అణ్వాయుధాలను మోసుకెళ్లే శక్తివంతమైన క్షిపణిగా దీనిని డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది. కాగా, ఈనెల మే 8న అడ్వాన్స్ అగ్ని మిజైల్‌ను ఒడిస్సాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఇండియా విజయవంతంగా పరీక్ష చేసింది. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీ-ఎంట్రీ వెహికల్ సిస్టమ్ (ఎంఐఆర్‌వీ)తో ఈ క్షిపణి పరీక్ష నిర్వహించారు. వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న బహుళ లక్ష్యాలను ఈ క్షిపణి విజయవంతంగా ఛేదించింది. ఇండియాకు పెరుగుతున్న ముప్పు అవకాశాలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నద్ధతను ఎంఐఆర్‌వీ చాటిచెప్పిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్‌డీఓను ప్రశంసించారు.


ఇవికూడా చదవండి..

రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..

దేవాలయాలపై ప్రభుత్వాల నియంత్రణ చట్టాలు.. విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్

Updated Date - May 22 , 2026 | 09:31 PM