Share News

పాకిస్థానీ కశ్మీర్ అంటూ ఏదీ లేదు.. న్యూయార్క్ టైమ్స్ కథనంపై భారత్ తీవ్ర అభ్యంతరం..

ABN , Publish Date - Jul 30 , 2026 | 01:54 PM

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను పాకిస్థానీ కశ్మీర్‌గా పేర్కొంటూ అమెరికా పత్రిక 'ది న్యూయార్క్ టైమ్స్' ప్రచురించిన కథనంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

పాకిస్థానీ కశ్మీర్ అంటూ ఏదీ లేదు.. న్యూయార్క్ టైమ్స్ కథనంపై భారత్ తీవ్ర అభ్యంతరం..
New York Times

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)ను పాకిస్థానీ కశ్మీర్‌ (Pakistani Kashmir)గా పేర్కొంటూ అమెరికా పత్రిక 'ది న్యూయార్క్ టైమ్స్' ప్రచురించిన కథనంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం స్పందిస్తూ, 'పాకిస్థానీ కశ్మీర్ అనే ప్రాంతం లేదు. అది చట్టవిరుద్ధంగా పాకిస్థాన్ ఆక్రమించిన భారత భూభాగం' అని స్పష్టం చేసింది (India, New York Times).


భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ప్రకటనలో, 'జమ్మూ-కశ్మీర్ మొత్తం భారతదేశంలో అంతర్భాగం. పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాన్ని 'పాకిస్థానీ కశ్మీర్'గా పేర్కొనడం వాస్తవాలకు విరుద్ధం' అని పేర్కొంది. అంతర్జాతీయ మీడియా ఇలాంటి సున్నితమైన అంశాలపై ఖచ్చితమైన, బాధ్యతాయుతమైన పదజాలాన్ని ఉపయోగించాలని సూచించింది (Indian Embassy).


పాకిస్థాన్‌ ఆక్రమిత్ కశ్మీర్‌లో జరుగుతున్న ఘర్షణలను ప్రస్తావిస్తూ.. అమెరికా మీడియా సంస్థ 'ది న్యూయార్క్ టైమ్స్' ఓ కథనం ప్రచురించింది (Pakistan Occupied Kashmir). 'స్థానిక ఎన్నికలు ప్రారంభం కాగానే పాకిస్థానీ కశ్మీర్‌లో ఘర్షణలు చెలరేగాయి' అంటూ ఆ కథనానికి హెడ్డింగ్ పెట్టింది. ఈ కథనంపై భారత రాయబార కార్యాలయం అభ్యంతరం వ్యక్తం చేసింది.


ఇవి కూడా చదవండి..

పసిడి ధరలు మరింత తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..


ఫ్రాన్స్‌ను కలవరపెడుతున్న కార్చిచ్చు.. అణు కేంద్రాల వైపు దూసుకొస్తున్న మంటలు..

Updated Date - Jul 30 , 2026 | 01:54 PM