తమిళనాడు పాఠశాలల్లో వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ.. సీఎం విజయ్ పరిశీలనలో ప్రతిపాదన..
ABN , Publish Date - Jul 30 , 2026 | 12:36 PM
తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కింద వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ మంత్రి ఏ. రాజ్‌మోహన్ వెల్లడించారు.
తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం (Mid-Day Meal Scheme) కింద వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ మంత్రి ఏ. రాజ్‌మోహన్ వెల్లడించారు. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి విజయ్‌కు అధికారికంగా పంపించామని, ప్రస్తుతం ఆయన పరిశీలిస్తున్నట్లు తెలిపారు (Chicken Biryani Mid Day Meal Scheme).
తమిళనాడులో మధ్యాహ్న భోజన పథకం కాలక్రమేణా అనేక మార్పులు చూసిందని మంత్రి రాజ్‌మోహన్ గుర్తుచేశారు. జస్టిస్ పార్టీ కాలంలో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని కామరాజ్ విస్తరించారని, కరుణానిధి గుడ్లను ప్రవేశపెట్టారని తెలిపారు. ఇక, ఎంజీఆర్, జయలలిత మరిన్ని పోషకాహార అంశాలను జోడించారని చెప్పారు. అదే తరహాలో విద్యార్థులకు వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించాలని తాను ప్రతిపాదించినట్లు వెల్లడించారు (CM Vijay Chicken Biryani).
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి భోజనానికి సుమారు రూ.15 ఖర్చు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు (Tamil Nadu Government Schools). ఉదయం అల్పాహార పథకంలో ప్రస్తుతం ఇస్తున్న ఉప్మా వంటి పదార్థాలకు బదులుగా మరింత పోషకవిలువలు, వైవిధ్యం ఉన్న ఆహారాన్ని అందించే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు చెప్పారు. కాగా, చికెన్ బిర్యానీని మిడ్-డే మీల్‌లో చేర్చడంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఆర్థిక భారం, అమలు విధానం, పోషకాహార ప్రమాణాలు, సరఫరా వ్యవస్థ వంటి అంశాలను సమీక్షించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
పసిడి ధరలు మరింత తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
ఫ్రాన్స్‌ను కలవరపెడుతున్న కార్చిచ్చు.. అణు కేంద్రాల వైపు దూసుకొస్తున్న మంటలు..