గూగుల్‌ను అధిగమించిన మైక్రోసాఫ్ట్.. ఏఐ సూపర్ యాప్ గురించి సత్య నాదెళ్ల ఏమన్నారంటే..
ABN , Publish Date - Jul 30 , 2026 | 11:49 AM
మైక్రోసాఫ్ట్ మరోసారి అంచనాలను మించి ఆర్థిక ఫలితాలు నమోదు చేసింది. 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ 90 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 8.6 లక్షల కోట్లు) ఆదాయం నమోదు చేసింది.
మైక్రోసాఫ్ట్ మరోసారి అంచనాలను మించి ఆర్థిక ఫలితాలు నమోదు చేసింది. 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ 90 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 8.6 లక్షల కోట్లు) ఆదాయం నమోదు చేసింది. క్లౌడ్, కృత్రిమ మేధ (AI) సేవలే ప్రధాన వృద్ధి ఇంజిన్‌గా నిలిచాయి. ముఖ్యంగా అజుర్ క్లౌడ్ సేవల ఆదాయం 43 శాతం పెరిగింది. క్లౌడ్ వ్యాపారంలో గూగుల్‌ను మైక్రోసాఫ్ట్ వెనక్కి నెట్టిందని కంపెనీ వెల్లడించింది (Microsoft Income).
ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది చివర్లో ఏఐ ఆధారిత 'కో పైలెట్ సూపర్ యాప్'ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సూపర్ యాప్ ద్వారా చాట్, కోడింగ్, కార్యాలయ సహకార టూల్స్, ఆటోమేటెడ్ ఏఐ ఏజెంట్లు వంటి అనేక సేవలను ఒకే వేదికపై అందించనున్నారు. వినియోగదారులతో పాటు వ్యాపార సంస్థల అవసరాలను కూడా తీర్చేలా ఈ యాప్‌ను రూపొందిస్తున్నట్లు చెప్పారు (Satya Nadella Azure).
కాగా, మైక్రోసాఫ్ట్‌కు 2026 ఒక రికార్డు స్థాయి ఆర్థిక సంవత్సరం అని సత్య నాదెళ్ల పేర్కొన్నారు (AI Super App Copilot). కంపెనీ వార్షిక ఆదాయం 331 బిలియన్ డాలర్లను దాటిందని తెలిపారు. అందులో మొత్తం క్లౌడ్ వ్యాపారం ద్వారా 214 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ ప్రధాన క్లౌడ్ వ్యాపారమైన అజూర్, తొలిసారిగా 100 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిందన్నారు.
ఇవి కూడా చదవండి..
పసిడి ధరలు మరింత తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
ఫ్రాన్స్‌ను కలవరపెడుతున్న కార్చిచ్చు.. అణు కేంద్రాల వైపు దూసుకొస్తున్న మంటలు..