Share News

మా అంతర్గత వ్యవహారాలపై మాట్లాడే హక్కు మీకు లేదు.. పాకిస్థాన్‌ అధ్యక్షుడికి భారత్ కౌంటర్..

ABN , Publish Date - Jun 21 , 2026 | 11:27 AM

పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. భారతదేశంలోని ముస్లిం ప్రార్థనా స్థలాలకు ముప్పు ఉందంటూ ఆయన చేసిన ఆరోపణలను అసంబద్ధమైనవిగా పేర్కొంది.

మా అంతర్గత వ్యవహారాలపై మాట్లాడే హక్కు మీకు లేదు.. పాకిస్థాన్‌ అధ్యక్షుడికి భారత్ కౌంటర్..
India Pakistan Relations

పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. భారతదేశంలోని ముస్లిం ప్రార్థనా స్థలాలకు ముప్పు ఉందంటూ ఆయన చేసిన ఆరోపణలను అసంబద్ధమైనవిగా పేర్కొంది. అలాగే భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యానించే హక్కు ఆయనకు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మాట్లాడారు (India Pakistan Relations).


భారతదేశానికి సంబంధించిన అంతర్గత అంశాలపై స్పందించే అధికారం జర్దారీకి లేదని రణ్‌ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. మానవ హక్కుల విషయంలో పాకిస్థాన్ చరిత్ర అత్యంత దారుణంగా ఉందని ఎద్దేవా చేశారు. పాక్‌లో వివిధ మతాలకు చెందిన అల్పసంఖ్యాక వర్గాలపై వ్యవస్థాగత వివక్ష, వేధింపులు కొనసాగుతున్నాయనే విమర్శలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని గుర్తు చేశారు. వారణాసిలోని చారిత్రాత్మక మసీదు గంజ్ షహీదా వివాదం గురించి సోషల్ మీడియా ద్వారా జర్దారీ స్పందించారు (Asif Ali Zardari India Response).


గంజ్ షహీదా మసీదు స్థలంపై చారిత్రక, మతపరమైన హక్కుల అంశం ప్రస్తుతం భారత న్యాయస్థానాల్లో విచారణలో ఉంది (Religious Sites Row). ఈ నేపథ్యంలో జర్దారీ స్పందిస్తూ, భారతదేశంలోని కొన్ని మసీదులు, మతపరమైన ప్రదేశాలు ప్రమాదంలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. అయితే భారత్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. భారత అంతర్గత వ్యవహారాలపై మాట్లాడే హక్కు పాకిస్థాన్‌కు లేదని, న్యాయస్థానాల్లో ఉన్న అంశాలపై విదేశీ నాయకులు వ్యాఖ్యానించడం తగదని విదేశాంగ శాఖ పేర్కొంది.


ఇవి కూడా చదవండి..

మెకానిక్ కోతి.. సైకిల్‌కు ఎలా పంక్చర్ వేస్తోందో చూడండి..


స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 21 , 2026 | 11:29 AM