Share News

'బుక్ నౌ - పే లేటర్' విధానం అమలు చేస్తాం: కేంద్ర మంత్రి పెమ్మసాని

ABN , Publish Date - Mar 17 , 2026 | 04:33 PM

భారతీయ తపాలా శాఖ వినియోగదారుల కోసం కేంద్రం కొత్త సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్యారంటీడ్ నెక్ట్స్ డే డెలివరీ సేవల్ని కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు.

'బుక్ నౌ - పే లేటర్' విధానం అమలు చేస్తాం: కేంద్ర మంత్రి పెమ్మసాని
India Post next day delivery

ఢిల్లీ, మార్చి17: భారతీయ తపాలా శాఖ వినియోగదారుల కోసం కేంద్రం కొత్త సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్యారంటీడ్ నెక్ట్స్ డే డెలివరీ సేవల్ని కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ విప్లవాత్మకమైన మార్పుతో ఇకపై ఉత్తరాలు, పత్రాల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. 'బుక్ నౌ - పే లేటర్' విధానం అమలు చేస్తామని తెలిపారు.


'త్వరలో ఎస్ఎంఎస్ ట్రాకింగ్, ఓటీపీ డెలివరీ, జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేయబోతున్నాం. 97-98 శాతం డెలివరీలు 24-48 గంటల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. బిజినెస్ కస్టమర్లకు 'బుక్ నౌ – పే లేటర్' విధానం అమలు చేస్తాం. పికప్ సేవలు, వాల్యూమ్ డిస్కౌంట్లతో ఎక్కువమంది వినియోగదారులకు సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ప్రైవేట్ కొరియర్‌లతో పోలిస్తే తపాలాలో తక్కువ ధరలు ఉన్నాయి. తపాలా శాఖలో ఎయిర్ ఎక్స్‌ప్రెస్ కంటే 2 రెట్లు, సర్ఫేస్ లాజిస్టిక్స్ కన్నా 4 రెట్లు, లైట్ పార్శిల్స్‌కో పోల్చితే 6 రెట్లు తక్కువ ధరలు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1.6 లక్షల పోస్టాఫీసులు ఉన్నాయి. అమెజాన్, షిప్‌రాకెట్‌‌ల డెలివరీలు అన్ని తపాలా ద్వారా జరిగేలా ఒప్పందం చేసుకుంటున్నాం. ఇది సేవల మార్పు కాదు, వ్యవస్థలో సంస్కరణ. ఇండియా పోస్టులో ఆర్థికాభివృద్ధికి కీలకం' అని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.


ఇవాళ(మంగళవారం) నుంచి గ్యారంటీడ్ నెక్ట్స్ డే ద్వారా 24 గంటల్లో పోస్ట్ డెలివరీ సేవలు ప్రారంభమ్యాయి. ఇప్పటివరకు 48 గంటల స్పీడ్ పోస్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో 30 కోట్ల మంది ఈ-కామర్స్ వినియోగదారులకు తపాలా సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం.. పార్శిల్ మార్కెట్ విలువ రూ.90,000 కోట్లు ఉంది. రాబోయే ఆరేళ్లలో రూ.1.8 లక్షల కోట్లకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చే సేవలతో గ్రామీణ ప్రాంతాల వారికి అధిక ప్రయోజనం చేకూరనుంది. లాజిస్టిక్స్‌లో 60 శాతం వాటా ఈ ప్రాంతాల నుంచే వస్తోంది.


ఇవి కూడా చదవండి:

మోదీని కలిసిన వరుణ్ గాంధీ.. మళ్లీ యాక్టివ్ రాజకీయాల్లో పాల్గొనే అవకాశం

గుజరాత్‌ కాండ్లా పోర్టుకు వస్తున్న మరో రెండు నౌకలు

Updated Date - Mar 17 , 2026 | 05:59 PM