Share News

వైద్య పరికరాల ధరలపై నియంత్రణ..?

ABN , Publish Date - Sep 20 , 2026 | 06:18 AM

ఆస్పత్రుల్లో రోగులకు వైద్యం అందించేందుకు వాడే ఐవీ సెట్లు, సిరెంజిలు తదితర వైద్య పరికరాల ఉత్పత్తి ఖర్చులు, అమ్మకం ధరల...

వైద్య పరికరాల ధరలపై నియంత్రణ..?

న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: ఆస్పత్రుల్లో రోగులకు వైద్యం అందించేందుకు వాడే ఐవీ సెట్లు, సిరెంజిలు తదితర వైద్య పరికరాల ఉత్పత్తి ఖర్చులు, అమ్మకం ధరల మధ్య భారీ వ్యత్యాసం ఉంటుండటంతో.. ఈ ధరలను నియంత్రణలో పెట్టడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఫార్మా, వైద్య పరికరాల ఉత్పత్తి కంపెనీలతోపాటు ఆస్పత్రుల యాజమాన్యాలతో ఈ అంశంపై చర్చలు జరిపేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల మహారాష్ట్రలో ఎఫ్‌డీఏ నిర్వహించిన సర్వేలో ఆస్పత్రుల్లో ఇంజక్షన్లు, సెలైన్లకు అసలు ధర కంటే వందల రెట్లు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌లో అంతర్జాతీయ చోరీ మొబైల్ ఫోన్ల డిస్పోజల్ రాకెట్ గుట్టురట్టు

మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క ఆదేశాలివే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 06:18 AM