Share News

కార్లు, బైకులకు కొత్త రూల్స్‌పై కేంద్రం కసరత్తు

ABN , Publish Date - Nov 26 , 2026 | 04:45 AM

బీమా లేకుండానే కార్లు, ద్విచక్రవాహనాలను రోడ్లపై ఇష్టంవచ్చినట్లు నడిపేవారికి.. తరచూ ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించే వాహనదారులకు గట్టి షాకిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది

కార్లు, బైకులకు కొత్త రూల్స్‌పై కేంద్రం కసరత్తు
insurence

  • వాహనానికి బీమా ఉంటేనే ఇంధనం నింపేలా నిబంధన!

న్యూఢిల్లీ, నవంబరు 25: బీమా లేకుండానే కార్లు, ద్విచక్రవాహనాలను రోడ్లపై ఇష్టంవచ్చినట్లు నడిపేవారికి.. తరచూ ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించే వాహనదారులకు గట్టి షాకిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ట్రాఫిక్‌ నియమాలను ఎంత ఎక్కువగా ఉల్లంఘిస్తే ఆ వాహనం బీమా ప్రీమియం కూడా అంతగా పెరిగేలా మోటారు వాహనాల చట్టంలో మార్పులు చేసే అంశంపై కసరత్తు చేస్తోంది. అంతేకాదు.. బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో ఇంధనం నింపకుండా నిషేధించే అంశాన్ని కూడా కేంద్ర రోడ్డు రవాణా సంస్థ పరిశీలిస్తోందని జాతీయ మీడియా పేర్కొంది. ఈ మార్పులను ఎప్పటి నుంచి అమలుచేయాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ.. వాహన యజమానులు, డ్రైవర్లలో జవాబుదారీతనాన్ని పెంచే కచ్చితమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది.

పెట్రోల్‌ బంకుల్లో ఏఎన్‌పీఆర్‌ వ్యవస్థ..!

రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ బీమా లేని వాహనాలకు ఇంధనం లభించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర పెట్రోలియం, రోడ్డు రవాణా శాఖలకు ఇటీవల సూచించింది. ఈ విధానంపై మొదట పైలట్‌ ప్రాజెక్టు చేపట్టాలని కోరింది. దీంతో హరియాణా, ఉత్తరప్రదేశ్‌లలో 5 చొప్పున పెట్రోల్‌ బంకుల్లో ఆటోమేటెడ్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌ (ఏఎన్‌పీఆర్‌) వ్యవస్థను ఏర్పాటు చేసి పరీక్షించి చూడాలని నిర్ణయించారు. ఈ వ్యవస్థలో భాగంగా పెట్రోల్‌ బంకుల్లో ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేస్తారు. వాహనం ఇంధనం కోసం రాగానే దాని నంబర్‌ ప్లేటును కెమెరా రికార్డు చేసి కంప్యూటర్‌కు పంపుతుంది. కంప్యూటర్‌లోని వాహనాల డేటాబే్‌సను ఈ వ్యవస్థ దానంతట అదే పరిశీలించి ఆ వాహనానికి బీమా ఉందో లేదో గుర్తిస్తుంది. బీమా ఉంటేనే ఇంధనం నింపుతారు

ఇవి కూడా చదవండి:

వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా

ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్

Updated Date - Nov 26 , 2026 | 06:03 AM