Share News

దేశవ్యాప్తంగా మృత్యుఘోష.. నాలుగు ప్రమాదాలు.. 22 మంది బలి

ABN , Publish Date - Nov 09 , 2026 | 12:03 PM

నిన్నటి రాత్రి నుంచి నేటి ఉదయం వరకు చోటుచేసుకున్న నాలుగు వేర్వేరు ప్రమాదాలు 22 మందిని బలి తీసుకున్నాయి. ఏకంగా నాలుగు కుటుంబాలను మింగేశాయి.

దేశవ్యాప్తంగా మృత్యుఘోష.. నాలుగు ప్రమాదాలు.. 22 మంది బలి

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా నిన్నటి రాత్రి నుంచి నేటి ఉదయం వరకు పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వీటిలో అత్యధికంగా అగ్ని ప్రమాదాలే ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్.. ఇలా వేర్వేరు రాష్ట్రాల్లో జరిగిన నాలుగు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఏకంగా నాలుగు కుటుంబాలను మింగేశాయి. 22 మందిని బలి తీసుకున్నాయి. అగ్ని ప్రమాదాల కారణంగా రెండు కుటుంబాలు మృత్యు కోరల్లో చిక్కుకోగా... కారు అదుపు తప్పడంతో మరో రెండు కుటుంబాలు బలయ్యాయి.


మధ్యప్రదేశ్‌లో అగ్నిప్రమాదాలు

ఒక్క మధ్యప్రదేశ్‌లోనే రెండు ఘోర అగ్నిప్రమాదాలు సంభవించాయి. ఈ రెండు ఘటనల్లో 12 మంది మృత్యువాతపడ్డారు. ఆ రాష్ట్రంలోని కట్నీ జిల్లాలో మూడంతస్తుల భవనంలో ఒక కుటుంబం నివసిస్తోంది. నిన్న అర్ధరాత్రి ఒక్కసారిగా ఆ భవనంలో మంటలు చెలరేగాయి. గాఢ నిద్రలో ఉన్న కుటుంబ సభ్యులు మంటల్లో చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మృతుల్లో రెండు నెలల పసికందు కూడా ఉంది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికే చెందిన శివ్నీ జిల్లాలోని ఛపారాలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలోని ఓ నగల వ్యాపారి ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో వ్యాపారి కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.Untitled-1 copy.jpg(కట్నీ జిల్లాలో అగ్నిప్రమాదానికి గురైన భవనం)


కుటుంబం.. సజీవదహనం

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో వేగంగా వెళ్తున్న కారు ఓ స్తంభాన్ని ఢీకొట్టడంతో మంటలు అంటుకున్నాయి. దీంతో కారులో ఉన్న ఆరుగురూ సజీవ దహనమయ్యారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విషాదకరం. ఈ కారులో ఉన్న పదేళ్ల చిన్నారీ కన్నుమూసింది. కాగా మృతులను హరియాణా వాసులుగా పోలీసులు గుర్తించారు.Untitled-1 copy.jpg


వేడుకల కోసం వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు..

ఛత్తీస్‌గఢ్‌లో కారు అదుపుతప్పడం వల్ల ఒకే కుటుంబంలోని నలుగురు సభ్యులూ మృతి చెందారు. దీపావళి వేడుకల కోసం వీరు రాయ్‌పూర్‌ నుంచి గరియాబాద్‌కు కారులో బయలుదేరారు. అయితే టీలా అనికట్ వద్ద వీరి కారు అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు, వారి పిల్లలిద్దరూ మరణించారు. దీంతో స్థానికంగా విషాదమేఘాలు అలుముకున్నాయి.Untitled-1 copy.jpg


ఈ వార్తలూ చదవండి

దీపావళి తర్వాత ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. 366కు చేరిన సగటు ఏక్యూఐ..!

రాజకీయాల కోసం రాయలేదు.. ఆత్మకథపై సోనియాగాంధీ క్లారిటీ

Updated Date - Nov 09 , 2026 | 12:18 PM