Share News

3,000 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్న భారత కోస్ట్ గార్డ్

ABN , Publish Date - Sep 30 , 2026 | 08:27 PM

భారత కోస్ట్ గార్డ్ అరేబియా సముద్రంలో సుమారు రూ.3వేల కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్ పట్టుకున్నారు. ఆ పడవలో ఉన్న ఐదుగురు పాకిస్తానీ పౌరులను అదుపులోకి తీసుకున్నారు.

3,000 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్న భారత కోస్ట్ గార్డ్
Rs.3,000 Crore Drugs Seized in Arabian Sea, 5 Pakistani Nationals Held

ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 30: భారత కోస్ట్ గార్డ్ (ICG), గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) సంయుక్తంగా నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో అరేబియా సముద్రంలో సుమారు రూ.3,000 కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్ బయటపడ్డాయి. లక్షద్వీప్‌కు పశ్చిమ దిశలో సాగిన ఈ ఆపరేషన్‌లో ఒక ఇరానియన్ పడవ నుంచి సుమారు 526 కిలోల హెరాయిన్, మెథాంఫెటమైన్ రకం మత్తుపదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


సెప్టెంబర్ 25న అందిన కచ్చితమైన నిఘా సమాచారం ఆధారంగా కోస్ట్ గార్డ్ సముద్రంలోనూ, గగనతలంలోనూ నిఘాను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇరానియన్ పడవను అడ్డుకుని తనిఖీ చేయగా ఈ భారీ డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఆ పడవలో ఉన్న ఐదుగురు పాకిస్తానీ పౌరులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న వేల కోట్ల విలువైన డ్రగ్స్‌తో పాటు, ఇరానియన్ పడవను, అదుపులోకి తీసుకున్న పాకిస్తానీ సిబ్బందిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం ముంబైకి తరలిస్తున్నారు. అక్కడ వివిధ భద్రతా సంస్థలు సంయుక్తంగా ఈ ఘటనపై లోతైన విచారణ జరపనున్నాయి.


ఈ వార్తలూ చదవండి

సూపర్ ఇంటెలిజెన్స్.. ఏఐకి కొత్త పేరును ప్రకటించిన ట్రంప్

ఏఐతో మానవాళికి ముప్పే!

Updated Date - Sep 30 , 2026 | 08:27 PM