రేపు ఇండియా కూటమి సమావేశం.. డీఎంకే దూరం.. హాజరుకానున్న టీవీకే..
ABN , Publish Date - Jun 07 , 2026 | 09:27 PM
ప్రతిపక్షాల ఇండియా కూటమి సోమవారం న్యూఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలు భాగస్వామ్య పార్టీలు ఎదురుదెబ్బల తిన్న తర్వాత జరగనున్న తొలి ప్రధాన సమావేశం ఇదే.
ప్రతిపక్షాల ఇండియా కూటమి సోమవారం న్యూఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలు భాగస్వామ్య పార్టీలు ఎదురుదెబ్బల తిన్న తర్వాత జరగనున్న తొలి ప్రధాన సమావేశం ఇదే. ఈ సమావేశంలో కూటమి భవిష్యత్ వ్యూహం, ఐక్యత, బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి సుమారు 23 ప్రతిపక్ష పార్టీలు హాజరుకానున్నట్లు సమాచారం (INDIA bloc meeting).
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటోంది. అయితే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న డీఎంకే మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించింది. అలాగే గత కొన్నాళ్లుగా ఇండియా కూటమికి దూరంగా ఉంటున్న ఆప్ కూడా ఈ సమావేశానికి దూరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక, తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ఈ సమావేశానికి హాజరుకాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి (Opposition alliance).
టీవీకేను ఇండియా కూటమిలో చేర్చుకోవడంతో గుర్రుగా ఉన్న డీఎంకే ఈ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది (DMK exit). తమిళనాడు ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీ, విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు ఇవ్వడాన్ని డీఎంకే వ్యతిరేకించింది. అలాగే ఈ సమావేశానికి ముందు కాంగ్రెస్, వామపక్షాల మధ్య విభేదాలు కూడా బయటపడ్డాయి. కేరళ ఎన్నికల ప్రచారంలో పరస్పరం చేసుకున్న ఆరోపణలపై సీపీఎం, కాంగ్రెస్ నుంచి వివరణ కోరింది.
ఇవి కూడా చదవండి..
మోదీ ఇచ్చిన వజ్రాన్ని కొనాలనుకున్నా.. కానీ..: జిల్ బైడెన్..
భారత్‌తో కొత్త అధ్యాయానికి సిద్ధం: నేపాల్ విదేశాంగ మంత్రి