దేశ రాజధానిలో ఆగస్టు 15 వేడుకలకు సర్వం సిద్ధం..
ABN , Publish Date - Aug 13 , 2026 | 06:29 PM
దేశ రాజధానిలోని చారిత్రక ఎర్రకోటపై 80వ స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఆగస్టు 15న ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేయనున్నారు.
ఢిల్లీ: దేశ రాజధానిలోని చారిత్రక ఎర్రకోటపై 80వ స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఆగస్టు 15న ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేయనున్నారు. ఈ ఏడాది 'వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు, వికసిత్ భారత్@2047 కోసం యువశక్తి' థీమ్‌లతో ఎర్రకోట ముస్తాబైంది. చరిత్రలో తొలిసారిగా ఎర్రకోట స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించనున్నారు. అలాగే జాతీయ పతాకావిష్కరణ వేళ వాయుసేనకు చెందిన Mi-17 హెలికాప్టర్ల ద్వారా పూలవర్షం కురిపించనున్నారు.
జ్ఞానపథ్‌లో వందేమాతరం ఆకృతిలో 2,500 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు, ‘మై భారత్’ వాలంటీర్లు కూర్చోనున్నారు. వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వివిధ రంగాలకు చెందిన దాదాపు 5 వేల మందికి అధికారులు ప్రత్యేక ఆహ్వానం పంపారు. వీఐపీ సంస్కృతికి స్వస్తి పలుకుతూ, భారతదేశంలోని ప్రముఖ సరస్సుల పేర్లతో సీటింగ్ ఎన్‌క్లోజర్లు ఏర్పాటు చేశారు. మరోవైపు, పర్యాటకుల సౌకర్యార్థం ఉచిత మెట్రో ప్రయాణం, క్యూఆర్ కోడ్ ఈ-ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. వేడుకలు ముగిసిన వెంటనే ఎర్రకోట పరిసరాల్లో చెత్త తొలగింపు కోసం 'స్వచ్ఛత ప్రచారం' కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
సుప్రీం కోర్టులో మరో రెండు కోర్టు హాల్స్ ప్రారంభం
60 రవాణా విమానాలు, 150 శిక్షణ విమానాలు.. భారత రక్షణ రంగం భారీ కొనుగోళ్లు..