సుప్రీం కోర్టులో మరో రెండు కోర్టు హాల్స్ ప్రారంభం
ABN , Publish Date - Aug 13 , 2026 | 05:46 PM
సుప్రీం కోర్టులో నూతన కోర్టు హాల్స్, రిజిస్ట్రార్ కోర్టు హాల్స్ ప్రారంభమయ్యాయి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ వీటిని ప్రారంభించారు.
ఇంటర్నెట్ డెస్క్: సుప్రీం కోర్టులో నూతన కోర్టు హాల్స్, రిజిస్ట్రార్ కోర్టు హాల్స్ ప్రారంభమయ్యాయి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ వీటిని ప్రారంభించారు. మరో రెండు రిజిస్ట్రార్ హాల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. మెయిన్ క్యాంపస్‌లోని వెస్ట్ వింగ్ మొదటి అంతస్తులో వీటిని ఏర్పాటు చేశారు. ఈ మేరకు డిప్యూటీ రిజిస్ట్రార్ ఒక ప్రకటన జారీ చేశారు.
ఇటీవల సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను పెంచుతూ పార్లమెంట్ చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ సహా మొత్తం న్యాయమూర్తుల సంఖ్యను 38కి పెంచుతూ పార్లమెంట్ చట్ట సవరణ తీసుకొచ్చింది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. బ్యాక్ లాగ్ కేసులు తగ్గించేందుకు వీలుగా పార్లమెంటు ఈ మేరకు చట్ట సవరణ చేసింది. ఈ నేపథ్యంలో న్యాయసేవలు మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరేలా రెండు కొత్త కోర్టు హాళ్లను చీఫ్ జస్టిస్ ప్రారంభించారు.
ఈ వార్తలనూ చదవండి:
షాకింగ్ వీడియో వైరల్.. బెంగళూరులో ఓ మహిళ మెడలో బంగారం చోరీ..
మావోయిస్టు క్యాంప్ నుంచి మోడలింగ్ ర్యాంప్ వరకు.. మారిన మాజీ మహిళా నక్సల్స్ జీవితాలు..