మావోయిస్టు క్యాంప్ నుంచి మోడలింగ్ ర్యాంప్ వరకు.. మారిన మాజీ మహిళా నక్సల్స్ జీవితాలు..
ABN , Publish Date - Aug 13 , 2026 | 03:51 PM
గతంలో ఆయుధాలు పట్టుకుని బస్తర్ అడవుల్లో నడిచిన ఆ మహిళలు ఇప్పుడు అదే ఆత్మవిశ్వాసంతో మోడలింగ్ ర్యాంప్‌పై నడిచారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన ఓకార్యక్రమంలో మాజీ మహిళా మావోయిస్టులు సందడి చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: గతంలో ఆయుధాలు పట్టుకుని బస్తర్ అడవుల్లో నడిచిన ఆ మహిళలు ఇప్పుడు అదే ఆత్మవిశ్వాసంతో మోడలింగ్ ర్యాంప్‌పై నడిచారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన ఓకార్యక్రమంలో మాజీ మహిళా మావోయిస్టులు సందడి చేశారు. సాంప్రదాయ చేనేత వస్త్రాలను ధరించి ర్యాంప్ వాక్ చేశారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Former Women Maoists).
బస్తర్ ప్రాంతానికి చెందిన ఈ మహిళలు గతంలో మావోయిస్టు ఉద్యమంలో పనిచేశారు. అనంతరం లొంగిపోయి సాధారణ జనజీవనంలోకి తిరిగి వచ్చారు. ఇప్పుడు వారు తమకు లభించిన కొత్త అవకాశాలను ఉపయోగించుకుంటూ వివిధ రంగాల్లో ముందుకు సాగుతున్నారు. రాయ్‌పూర్‌లోని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆడిటోరియంలో నిర్వహించిన చేనేత కార్యక్రమంలో వారు కోసా పట్టు, చేతితో నేసిన సాంప్రదాయ ఛత్తీస్‌గఢ్ వస్త్రాలను ధరించి ర్యాంప్‌పై నడిచారు (Raipur Fashion Show).
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు (Maoist Rehabilitation). ర్యాంప్ వాక్ చేసిన మాజీ మహిళా మావోయిస్టులతో మాట్లాడి, వారి కొత్త ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వీరి ప్రయాణం ఇతర మావోయిస్టులకు కూడా సాధారణ జనజీవనంలోకి తిరిగి రావడానికి ప్రేరణగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు
అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిల ప్రారంభం