ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ.. రైలు, విమాన సేవలకు అంతరాయం..
ABN , Publish Date - Jul 07 , 2026 | 11:45 AM
దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంబైలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంబైలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైలు సేవలు చాలా వరకు నిలిచిపోయాయి. కొన్ని విమాన సర్వీసులు రద్దు కాగా, వందలాది విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు ఆపసోపాలు పడుతున్నారు (Mumbai Rains).
గత 24 గంటల వ్యవధిలో మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో 600 మిలీ మీటర్ల వర్షం కురిసింది. దీంతో ముంబై-పుణె మార్గంలోని కర్జత్-లోనావాలా ఘాట్ రోడ్డులో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ రూట్‌లో రెండ్రోజులుగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక, పుణె జిల్లాలోని ప్రముఖ హిల్ స్టేషన్ అయిన లోనవాలాలో గత 24 గంటల వ్యవధిలో 670 మిల్లీమీటర్ల వర్షం కురిసింది (Maharashtra Rains).

ముంబై, థానే, పుణె, పాల్ఘర్ ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఐఎండీ తాజా అంచనాల ప్రకారం, మహారాష్ట్రలోని కోంకణ్ ప్రాంతంతో పాటు పశ్చిమ కనుమల పరిసరాల్లో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్న అధికారులు అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నారు (Heavy Rain Alert).

ఇక, ముంబైలో మంగళవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ముంబై నగరం జలమయంగా మారింది. దీంతో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి..
శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
రాణిస్తున్న బ్యాంకింగ్ షేర్లు.. స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు