షాకింగ్ వీడియో.. రాత్రంతా తలుపు హ్యాండిల్‌పై కింగ్ కోబ్రా.. ఇంట్లోనే బందీ అయిన కుటుంబం..
ABN , Publish Date - Jul 07 , 2026 | 11:10 AM
ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాములు ఉన్నాయంటే అటువైపు వెళ్లడానికి కూడా వణికిపోతారు. విషపూరిత సర్పం కాటేస్తే నిమిషాల్లో ప్రాణాలు పోవడం ఖాయం.
ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాములు ఉన్నాయంటే అటువైపు వెళ్లడానికి కూడా వణికిపోతారు. విషపూరిత సర్పం కాటేస్తే నిమిషాల్లో ప్రాణాలు పోవడం ఖాయం. అలాంటిది రాత్రంతా ఒక విషపూరిత సర్పంతో ఒకే గదిలో ఉండాల్సి వస్తే ఎలా ఉంటుంది. తాజాగా ఓ కుటుంబానికి అలాంటి అనుభవమే ఎదురైంది (King Cobra Viral Video).
మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను @ReporterRavish అనే ఎక్స్ యూజర్ పంచుకున్నారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. రాత్రి సమయంలో ఇంటి ప్రధాన ద్వారం వద్దకు వచ్చిన కింగ్ కోబ్రా నేరుగా తలుపు హ్యాండిల్‌పైనే చుట్టుకుని కూర్చుంది. తలుపు తెరిస్తే పాము దాడి చేసే ప్రమాదం ఉండటంతో కుటుంబ సభ్యులు రాత్రంతా ఇంట్లోనే ఉండిపోయారు. ఇంట్లో చిన్నారులు, మహిళలు కూడా ఉండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది (Snake on Door Handle).
ఉదయం అయ్యాక కూడా పాము అక్కడే ఉండడంతో స్థానిక స్నేక్ రెస్క్యూ బృందానికి సమాచారం అందించారు (Snake viral video). అయితే కొద్దిసేపటికే కోబ్రా తలుపు హ్యాండిల్ నుంచి కిందికి దిగి ఇంట్లో ఉన్న టేబుల్ కిందకు వెళ్లి దాక్కుంది. దీంతో రెస్క్యూ సిబ్బంది అత్యంత జాగ్రత్తగా పామును పట్టుకుని సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు.
ఇవి కూడా చదవండి..
శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
రాణిస్తున్న బ్యాంకింగ్ షేర్లు.. స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు