Share News

ఐఐటీ బాంబేలో కీలక మార్పు.. సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో వాల్ మౌంటెడ్ ఫ్యాన్లు..

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:51 AM

బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థి సాహిల్ వాకోడే మృతితో తీవ్ర నిరసనలు కొనసాగుతున్న వేళ ఐఐటీ బాంబే కీలక చర్య చేపట్టింది. క్యాంపస్‌లోని హాస్టళ్లలో ఉన్న సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో గోడలకు అమర్చే వాల్ మౌంటెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయడం ప్రారంభించింది.

ఐఐటీ బాంబేలో కీలక మార్పు.. సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో వాల్ మౌంటెడ్ ఫ్యాన్లు..
IIT Bombay wall mounted fans

ఇంటర్నెట్ డెస్క్: బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థి సాహిల్ వాకోడే మృతితో తీవ్ర నిరసనలు కొనసాగుతున్న వేళ ఐఐటీ బాంబే కీలక చర్య చేపట్టింది. క్యాంపస్‌లోని హాస్టళ్లలో ఉన్న సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో గోడలకు అమర్చే వాల్ మౌంటెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. కొత్త ఫ్యాన్ల తొలి బ్యాచ్ ఇప్పటికే క్యాంపస్‌కు చేరుకుంది. అయితే ఈ మార్పు తాజా ఘటన తర్వాత తీసుకున్న నిర్ణయం కాదని ఐఐటీ బాంబే వర్గాలు చెబుతున్నాయి (IIT Bombay student death).


హాస్టళ్లలో చేపట్టనున్న పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఫ్యాన్లను మార్చే ప్రణాళిక ఇప్పటికే ఉందని పేర్కొన్నాయి. ఐఐటీ బాంబేలో రెండో సంవత్సరం విద్యార్థి సహిల్ వాకోడే హాస్టల్ గదిలో సెప్టెంబర్ 18న ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షా సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించాడని, ప్రశ్నపత్రాన్ని చాట్‌జీపీటీకి అప్‌లోడ్ చేసి సమాధానాలు పొందేందుకు ప్రయత్నించాడని ఐఐటీ బాంబే తెలిపింది. సాహిల్ మృతితో విద్యార్థులు ఆందోళన ప్రారంభించారు (IIT Bombay hostel).


ఐఐటీ బాంబేలోని హాస్టల్ గదుల్లో ఫ్యాన్లను మార్చడం ఒక్కటే విద్యార్థుల ఆత్మహత్యల సమస్యకు పరిష్కారం కాదని కొందరు విమర్శిస్తున్నారు (IIT Bombay wall mounted fans). విద్యార్థుల మానసిక ఆరోగ్యం, ఒత్తిడి, ఫిర్యాదుల పరిష్కారం, క్యాంపస్‌లో సహాయక వ్యవస్థలను బలోపేతం చేయడంపై కూడా దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు. కాగా, సహిల్ వాకోడే మృతికి సంబంధించిన పరిస్థితులపై ప్రస్తుతం అధికారిక దర్యాప్తు కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి..

ఆ మీడియా సంస్థలు కేన్సర్‌లాంటివి.. ట్రంప్ తీవ్ర విమర్శలు..


మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Sep 22 , 2026 | 11:51 AM