Share News

పార్టీ వీడాలనుకుంటే వెళ్లిపోవచ్చు.. ఎంపీల ఫిరాయింపు ఊహాగానాలపై ఉద్ధవ్ ఠాక్రే

ABN , Publish Date - Jun 16 , 2026 | 09:36 PM

పార్టీ ఎంపీల విధేయతకు సంబంధించిన వస్తున్న ఉహాగానాలపై శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మౌనం వీడారు. పార్టీని వీడాలని కోరుకునే వారు వెళ్లిపోవచ్చని చెప్పారు.

పార్టీ వీడాలనుకుంటే వెళ్లిపోవచ్చు.. ఎంపీల ఫిరాయింపు ఊహాగానాలపై ఉద్ధవ్ ఠాక్రే
Uddhav Thackeray

ముంబై: పార్టీ ఎంపీల విధేయతకు సంబంధించిన వస్తున్న ఉహాగానాలపై శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) మౌనం వీడారు. పార్టీని వీడాలని కోరుకునే వారు వెళ్లిపోవచ్చని చెప్పారు. ఠాక్రే వర్గంలోని ఏడుగురు ఎంపీలను 'ఆపరేషన్ టైగర్' పేరుతో తనవైపు తిప్పుకునేందుకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గే కుట్ర పన్నుతోందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఠాక్రే స్పందించారు.


శివసేనలో 2022లో వచ్చిన చీలకను ఠాక్రే ప్రస్తావిస్తూ, అప్పట్లో తిరుగుబాటు అవకాశం ఉందని ముందే తాను గ్రహించానని, 40 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారని చెప్పారు. అయితే ఎవరినీ పార్టీలో ఉండమని బలవంతం చేయకూడదని ఆనాడే తాను నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. 'ఇవాళ నారోజు కాకపోవచ్చు. రేపు కచ్చితంగా నాదే అవుతుంది. అంతవరకూ ఓర్పుతో ముందుకు సాగుతాను' అని ఠాక్రే అన్నారు. బాల్ ఠాక్రే స్థాపించిన పార్టీని వీడిన వారు ఎప్పటికైనా పశ్చాత్తాపపడతారని, అయితే అప్పటికే సమయం మించిపోతుందని పేర్కొన్నారు.


శివసేన యూబీటీ పార్టీ ఎంపీలు పార్టీ ఫిరాయించే అవకాశం ఉందనే ఊహాగానాల నేపథ్యంలో గత ఆదివారంనాడు ఠాక్రే తన నివాసంలో అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎంపీల్లో నలుగురు మాత్రమే హాజరయ్యారు. అయితే తక్కిన ఎంపీలు వర్చువల్‌గా సమావేశంలో హాజరైనట్టు యూబీటీ నేత సంజయ్ రౌత్ తెలిపారు. తొమ్మిది మంది ఎంపీలు శివసేన యూబీటీతోనే ఉన్నారని, వదంతులు నమ్మవద్దని సంజయ్ రౌత్, ఆదిత్య ఠాక్రేలు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

పుట్టిన ప్రతి చిన్నారిపై రూ.1.28 లక్షల అప్పు భారం.. తమిళనాడు ఆర్థిక పరిస్థితిపై విజయ్ శ్వేతపత్రం

అన్నాడీఎంకేకు మరో ఎమ్మెల్యే రాజీనామా.. నాయకత్వంపై అసంతృప్తి

Updated Date - Jun 16 , 2026 | 09:38 PM