Share News

అసోం సీఎంగా రేపు హిమంత ప్రమాణ స్వీకారం

ABN , Publish Date - May 11 , 2026 | 05:55 AM

అసోం ముఖ్యమంత్రిగా బీజేపీ, ఎన్డీయే పక్ష నేత హిమంత బిశ్వ శర్మను గవర్నర్‌ లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య నియమించారు. అంతకుముందు బీజేపీ...

అసోం సీఎంగా రేపు హిమంత ప్రమాణ స్వీకారం

గువాహటి, మే 10: అసోం ముఖ్యమంత్రిగా బీజేపీ, ఎన్డీయే పక్ష నేత హిమంత బిశ్వ శర్మను గవర్నర్‌ లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య నియమించారు. అంతకుముందు బీజేపీ శాసనసభాపక్ష నేతగా, ఎన్డీయే పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాక తనకు మద్దతిస్తోన్న ఎమ్మెల్యేల జాబితాతో శర్మ లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ గవర్నర్‌ ఆయనకు ఆహ్వానం పలికారు. అసోంలో ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి కొలువుతీరనుంది. ఖానాపారాలో మంగళవారం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు పలువురు సీఎంలు హాజరుకానున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్

జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం

సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 11 , 2026 | 05:55 AM