Share News

హిమాచల్ ప్రదేశ్‌ చంబా జిల్లాలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి..

ABN , Publish Date - Jul 28 , 2026 | 11:53 AM

హిమాచల్ ప్రదేశ్‌ చంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు ప్రమాదవశాత్తూ లోయలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో ఏడాది వయసున్న చిన్నారి ఉండటం స్థానికుల హృదయాలను తీవ్రంగా కలచివేస్తోంది.

హిమాచల్ ప్రదేశ్‌ చంబా జిల్లాలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి..
Himachal Pradesh Car Accident

హిమాచల్ ప్రదేశ్‌: చంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు ప్రమాదవశాత్తూ లోయలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. చనిపోయిన వారిలో ఏడాది వయసున్న చిన్నారి ఉండటం స్థానికుల హృదయాలను తీవ్రంగా కలచివేస్తోంది. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి భరమౌర్-పఠాన్‌కోట్ రహదారి లహార్ సమీపంలో జరిగింది. చిన్నారి అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బాధిత కుటుంబం పఠాన్‌కోట్‌కు కారులో బయలుదేరింది. చిన్నారి తల్లిదండ్రులు, తాతయ్య, అమ్మమ్మ కలిసి సోమవారం రాత్రి రోడ్డు మార్గాన బయలుదేరారు.


అయితే, లహార్ సమీపానికి రాగానే కారు ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు కచ్చితమైన కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించనప్పటికీ.. కారు నడుపుతున్న వ్యక్తి నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. రాత్రి వేళ కావడంతో ప్రమాదాన్ని గుర్తించేందుకు చాలా సమయం పట్టింది. అనంతరం స్థానికుల సమాచారంతో పోలీసులు, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.


మరోవైపు, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో బంధువులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేశామని, కచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు కొనసాగుతోందని చంబా ఎస్పీ విజయ్ సక్లానీ తెలిపారు. అలాగే కొండ ప్రాంత రహదారులపై రాత్రివేళ, ప్రతికూల వాతావరణంలో అత్యంత జాగ్రత్తగా వాహనాలు నడపాలని జిల్లా ప్రజలకు ఆయన సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

స్కైరూట్ వ్యవస్థాపకులతో ప్రధాని మోదీ భేటీ.. భారత భవిష్యత్ అంతరిక్ష ప్రణాళికలపై చర్చ

ప్రమాదానికి గురైన అమర్‌నాథ్ యాత్రికుల బస్సు.. 39 మందికి గాయాలు..

Updated Date - Jul 28 , 2026 | 12:52 PM