Share News

బీబీసీ, సీఎన్‌ఎన్‌, ఐకియా, జూమ్‌, హెచ్‌ఎస్ బీసీ నవంబర్ 16న ఈ వెబ్‌సైట్లు తెరిచారా?

ABN , Publish Date - Nov 18 , 2026 | 05:23 AM

ఈ నెల 16వ తేదీన.. బీబీసీ, సీఎన్‌ఎన్‌, జూమ్‌, హెచ్‌ఎ్‌సబీసీ, ఐకియా వెబ్‌సైట్లలో ఏదైనా వెబ్‌సైట్‌ను తెరిచారా? ఆయా సైట్లలో క్రెడిట్‌, డెబిట్‌ కార్డు ద్వారా చెల్లింపులేవైనా చేశారా? పాస్‌వర్డ్‌ టైప్‌ చేశారా? అయితే తస్మాత్‌ జాగ్రత్త.

బీబీసీ, సీఎన్‌ఎన్‌, ఐకియా, జూమ్‌, హెచ్‌ఎస్ బీసీ  నవంబర్ 16న ఈ వెబ్‌సైట్లు తెరిచారా?
image

  • ఏవైనా చెల్లింపులు చేశారా.. అయితే జర భద్రం

  • ఆ రోజు 178 సైట్లలోకి చొరబడ్డ హ్యాకర్లు

  • డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల వివరాలు, పాస్‌వర్డ్‌ల చోరీ

  • కుకీలను తొలగించాలని నిపుణుల సూచన

న్యూఢిల్లీ, నవంబరు 17: ఈ నెల 16వ తేదీన.. బీబీసీ, సీఎన్‌ఎన్‌, జూమ్‌, హెచ్‌ఎ్‌సబీసీ, ఐకియా వెబ్‌సైట్లలో ఏదైనా వెబ్‌సైట్‌ను తెరిచారా? ఆయా సైట్లలో క్రెడిట్‌, డెబిట్‌ కార్డు ద్వారా చెల్లింపులేవైనా చేశారా? పాస్‌వర్డ్‌ టైప్‌ చేశారా? అయితే తస్మాత్‌ జాగ్రత్త. ఆ రోజున ఈ వెబ్‌సైట్లు సహా ప్రపంచవ్యాప్తంగా 178 ప్రముఖ సంస్థల వెబ్‌సైట్లపై సైబర్‌ దాడి జరిగింది. అయితే.. హ్యాకర్లు నేరుగా ఈ వెబ్‌సైట్ల సర్వర్లను హ్యాక్‌ చేయకుండా, ఈ వెబ్‌సైట్లు తమ పేజీల పనితీరును, డిజైన్లను పరీక్షించుకోవడానికి వాడే ‘ఆప్టిమైజ్లీ వెబ్‌’ అనే థర్డ్‌ పార్టీ ప్లాట్‌ఫామ్‌లోకి చొరబడ్డారు. ఆ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఆయా కంపెనీల వెబ్‌సైట్లలోకి లోడ్‌ అయ్యే జావా స్ర్కిప్ట్‌ కోడ్‌లో హానికరమైన మాల్‌వేర్‌ను చొప్పించారు. దీనివల్ల ఈ నెల 16న ఆ వెబ్‌సైట్లను సందర్శించిన సాధారణ వినియోగదారుల బ్రౌజర్లలో ఈ హానికర జావాస్ర్కిప్ట్‌ రన్‌ అయ్యింది. దీనివల్ల.. ప్రభావిత వెబ్‌సైట్లను ఓపెన్‌ చేసిన వినియోగదారుల నుంచి హ్యాకర్లు.. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, పాస్‌వర్డ్‌ వివరాలు చోరీకి గురయ్యాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే... క్రిప్టో లావాదేవీలు చేసేవారు..


వాలెట్‌ అడ్రస్‌ కాపీ పేస్ట్‌ చేసినప్పుడు.. ఆ క్రిప్టో కరెన్సీ అసలైన వ్యక్తులకు చేరకుండా తమ ఖాతాల్లోకి మళ్లించేందుకు ‘క్రిప్టో క్లిప్పర్‌’ అనే విధానాన్ని హ్యాకర్లు ఈ జావాస్ర్కిప్ట్‌ ద్వారా వాడారు. అలా 7,040 డాలర్లు (దాదాపు రూ.6.5 లక్షలను) చోరీ చేశారు. అయితే.. సైబర్‌ దాడి విషయం తెలియగానే ఆప్టిమైజ్‌లీ అప్రమత్తమై ఆ మాల్‌వేర్‌ను తొలగించింది. ఆరోజు ఈ సైట్లను తెరిచినవారు తమ బ్రౌజర్లను అప్‌డేట్‌ చేసుకోవాలని.. క్యాచీని క్లియర్‌ చేసి, కుకీలను తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా.. పాత ఐవోఎస్‌ వెర్షన్‌ ఐఫోన్లు, ఐప్యాడ్‌లలోకి కూడా హ్యాకర్లు మాల్‌వేర్‌ను పంపించడానికి ప్రయత్నించారు కాబట్టి.. అలాంటి ఫోన్లు వాడేవారు తమ ఫోన్లను వెంటనే రీస్టార్ట్‌ చేసి, ఐవోఎస్ ను అప్ డేట్ చేయాలని, బ్రౌజర్ డేటా క్లియర్ చేయాలని టెక్ నిపుణులు సూచించారు.

ఇవి కూడా చదవండి..

ఢిల్లీలో కుప్పకూలిన 50 ఏళ్ల నాటి భవనం.. చిన్నారితో సహా ఇద్దరి మృతి

గ్రామాల విలీనంపై సుప్రీం విచారణ వాయిదా

Updated Date - Nov 18 , 2026 | 05:38 AM