గుజరాత్‌లో 1150 కోట్ల కొకైన్ స్వాధీనం
ABN , Publish Date - May 28 , 2026 | 05:16 AM
గుజరాత్ తీరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.1150 కోట్ల విలువ చేసే 115 కిలోల కొకైన్‌ను రవాణా చేస్తున్న అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను...
అహ్మదాబాద్, మే 27: గుజరాత్ తీరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.1150 కోట్ల విలువ చేసే 115 కిలోల కొకైన్‌ను రవాణా చేస్తున్న అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), ఇండియన్ కోస్టు గార్డ్ సంయుక్తంగా ఛేధించారు. ముంద్రా పోర్టులో ఒక నౌకను పట్టుకుని ముగ్గురు విదేశీయులను అరెస్టు చేసినట్లు బుధవారం అధికారులు తెలిపారు. యూరప్ పేరుతో ముంద్రాకు వచ్చిన సరుకు రవాణా నౌక ఇక్కడకి వచ్చే ముందు లాటిన్ అమెరికా, మెక్సికో, యూఎస్, కరాచీల మీదుగా ప్రయాణించిందని గుజరాత్ డీజీపీ కేఎల్‌ఎన్ రావు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
న్యాయవాది మొయినుద్దీన్ హత్యకేసులో కీలక పరిణామం
లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్
For More AP News And Telugu News