Share News

ఇరాన్ యుద్ధం ప్రభావం.. కేంద్రానికి రూ.1.23 లక్షల కోట్లు ఖర్చు..

ABN , Publish Date - Jun 09 , 2026 | 09:45 PM

ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడడంతో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా దేశీయంగా మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు.

ఇరాన్ యుద్ధం ప్రభావం.. కేంద్రానికి రూ.1.23 లక్షల కోట్లు ఖర్చు..
petrol diesel prices

ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడడంతో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా దేశీయంగా మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక భారం మోసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి (Petrol diesel prices).


ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలకు (OMCs) మద్దతుగా కేంద్రం రూ.1.23 లక్షల కోట్లు అందించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత 78 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల భారం వినియోగదారులపై పడకుండా ఉంచేందుకు కేంద్రం ఈ ఖర్చును భరించింది. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరిగినప్పటికీ, దేశీయ రిటైల్ ధరలను వెంటనే పెంచకుండా ప్రభుత్వం జోక్యం చేసుకుంది (Iran war fuel subsidy India).


భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది (Indian oil marketing companies). హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు, సరఫరా అంతరాయాలు, ముడి చమురు ధరల పెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. కాగా, ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను దశలవారీగా పెంచారు.


ఇవి కూడా చదవండి..

డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటును 50 ఏళ్లకు పొడిగించే అవకాశం..


యాపిల్ ఐఓఎస్ 27లో అదిరిపోయే ఫీచర్లు.. ఏయే ఫోన్లకు అందుబాటులోకి వస్తుందంటే..

Updated Date - Jun 09 , 2026 | 09:45 PM