Share News

ట్రై సిరీస్... శ్రీలంక-ఎపై భారత్-ఎ థ్రిల్లింగ్ విక్టరీ..

ABN , Publish Date - Jun 09 , 2026 | 08:04 PM

ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంకలోని దంబుల్లా వేదికగా శ్రీలంక-ఎతో జరిగిన మ్యాచ్‌లో భారత్-ఎ ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. 8 పరుగుల తేడాతో గెలుపొందింది.

ట్రై సిరీస్... శ్రీలంక-ఎపై భారత్-ఎ థ్రిల్లింగ్ విక్టరీ..
India A vs Sri Lanka A

ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంకలోని దంబుల్లా వేదికగా శ్రీలంక-ఎతో జరిగిన మ్యాచ్‌లో భారత్-ఎ ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. 8 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత యువ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్(101) సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ తిలక్ వర్మ (60) హాఫ్ సెంచరీ చేశాడు (India A vs Sri Lanka A).


278 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక-ఎ 269 పరుగులకు ఆలౌట్ అయింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక-ఎ చివరి వరకు పోరాడింది. శ్రీలంక్-ఎ కెప్టెన్ సహన్ (72) అర్ధశతకం సాధించాడు. ఓపెనర్లు నిరోషన్ (47), ఫెర్నాండో (45) చక్కటి భాగస్వామ్యం అందించారు. సదీరా (46) కూడా రాణించాడు. అయితే ఒత్తిడిలో అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత్-ఎ బౌలర్లు మ్యాచ్‌ను మలుపు తిప్పారు. అనుకూల్ రాయ్, ఆయుష్ బదోని, విప్రాజ్ నిగమ్, అర్షద్ ఖాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు (Ruturaj Gaikwad century).


అంతకు ముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఎ జట్టుకు శుభారంభం దక్కలేదు (Tri Nation A Series 2026). భారీ అంచనాలతో బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ (14) తీవ్రంగా నిరాశపర్చాడు. మరో విధ్వంసకర బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (2) కూడా స్వల్ప స్కోరుకే పెవిలియన్ బాట పట్టాడు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రుతురాజ్, తిలక్ వర్మ భారీ షాట్లతో అదరగొట్టారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 150 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్-ఎ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. సెంచరీతో అదరగొట్టిన రుతురాజ్‌ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.


ఇవి కూడా చదవండి..

డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటును 50 ఏళ్లకు పొడిగించే అవకాశం..


యాపిల్ ఐఓఎస్ 27లో అదిరిపోయే ఫీచర్లు.. ఏయే ఫోన్లకు అందుబాటులోకి వస్తుందంటే..

Updated Date - Jun 09 , 2026 | 08:06 PM