Share News

మీనాక్షి నటరాజన్‌కు షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ..

ABN , Publish Date - Jun 09 , 2026 | 07:40 PM

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ (Meenakshi Natarajan)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి ఆమె రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ వేయగా.. అది తిరస్కరణకు గురైంది.

మీనాక్షి నటరాజన్‌కు షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ..
Meenakshi Natarajan

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ (Meenakshi Natarajan)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి ఆమె రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ వేయగా.. అది తిరస్కరణకు గురైంది. నామినేషన్ పత్రాలతో సమర్పించిన అఫిడవిట్‌లో ఒక పెండింగ్ కేసుకు సంబంధించిన వివరాలను పూర్తిగా వెల్లడించలేదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి (Rajya Sabha election 2026).


నామినేషన్ల పరిశీలన సమయంలో బీజేపీ నాయకులు రిటర్నింగ్ అధికారికి అభ్యంతరం తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఒక కోర్టు కేసు వివరాలను మీనాక్షి నటరాజన్ తన అఫిడవిట్‌లో పేర్కొనలేదని బీజేపీ ఆరోపించింది. ఈ అభ్యంతరాన్ని పరిశీలించిన అనంతరం నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మీనాక్షి నటరాజన్ గతంలో లోక్‌సభ సభ్యురాలిగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు (Congress nomination rejected).


మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఉద్రిక్తతలు నెలకొన్నాయి (Madhya Pradesh Rajya Sabha polls). కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను కర్ణాటకకు తరలించి క్రాస్ ఓటింగ్‌ను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇక, మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ నిర్ణయాన్ని కాంగ్రెస్ సవాలు చేస్తుందా? లేదా ప్రత్యామ్నాయ వ్యూహంతో ముందుకు వెళ్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.


ఇవి కూడా చదవండి..

డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటును 50 ఏళ్లకు పొడిగించే అవకాశం..


యాపిల్ ఐఓఎస్ 27లో అదిరిపోయే ఫీచర్లు.. ఏయే ఫోన్లకు అందుబాటులోకి వస్తుందంటే..

Updated Date - Jun 09 , 2026 | 07:40 PM