జాతీయ రహదారులపై కొత్త ఫీజు విధానం.. ఓవర్ లోడ్‌తో వెళితే..
ABN , Publish Date - Apr 14 , 2026 | 09:49 PM
జాతీయ రహదారులపై ఓవర్‌లోడ్‌తో వెళ్లే వాహనాలకు విధించే జరిమానాలను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సవరించింది. జాతీయ రహదారులపై ఓవర్‌లోడ్‌తో వెళ్లే వాహనాలకు భారీ జరిమానా విధించబోతున్నట్టు తెలిపింది.
జాతీయ రహదారులపై ఓవర్‌లోడ్‌తో వెళ్లే వాహనాలకు విధించే జరిమానాలను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సవరించింది. జాతీయ రహదారులపై ఓవర్‌లోడ్‌తో వెళ్లే వాహనాలకు భారీ జరిమానా విధించబోతున్నట్టు తెలిపింది. ఈ నిబంధనలు ఏప్రిల్ 15వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి (Overloaded vehicles highway fees).
వాహనానికి అనుమతించిన బరువు కంటే అదనంగా ఉన్న భారాన్ని బట్టి జరిమానా వసూలు చేస్తారు. అనుమతించిన దాని కంటే పది శాతం ఓవర్‌లోడ్ ఉంటే జరిమానా ఉండదు. 10 నుంచి 40 శాతం వరకు ఓవర్‌లోడ్ ఉంటే సాధారణ టోల్ రుసుము కంటే రెండు రెట్లు అధికంగా వసూలు చేస్తారు. 40 శాతం కంటే ఎక్కువ ఓవర్‌లోడ్‌తో వెళితే నాలుగు రెట్లు అదనంగా టోల్ రుసుము విధిస్తారు (Overloaded trucks penalty).
ఓవర్‌లోడ్‌కు విధించే జరిమానాను ఫాస్టాగ్ ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది (National highway rules). ఓవర్ లోడ్ ఎంత ఉందో లెక్కేసే యంత్రాలు టోల్‌ప్లాజా వద్ద ఉంటాయి. ఒకవేళ టోల్‌ప్లాజా వద్ద బరువు కొలిచే ఏర్పాటు లేకపోతే ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం ఉండదు.
ఇవి కూడా చదవండి..
ఆ ఐదు దేశాలూ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఐక్యరాజ్యసమితికి ఇరాన్ లేఖ..
అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమవడానికి కారణం అదేనా.. అసలేం జరిగిందంటే..