ఇకపై ఈ మందులకు ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి
ABN , Publish Date - Jul 10 , 2026 | 02:05 PM
అధిక ఆల్కహాల్ శాతం ఉన్న కొన్ని మందులపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై 12 శాతానికి పైగా ఇథైల్ ఆల్కహాల్ ఉన్న మందులను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడికల్ షాపులు విక్రయించాలని సూచించింది.
ఇంటర్నెట్ డెస్క్: మందుల దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై 12 శాతానికి పైగా ఇథైల్ ఆల్కహాల్ ఉన్న కొన్ని మందులను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడే మెడికల్ షాపులు విక్రయించాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులను ఇవ్వొద్దని స్పష్టం చేసింది.
ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?
కొన్ని దగ్గు సిరప్‌లు, టానిక్‌లు వంటి మందుల్లో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉండటంతో వాటిని కొందరు వైద్య అవసరాలకు కాకుండా దుర్వినియోగం చేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదికలు అందాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మందుల విక్రయంపై మరింత కఠినమైన నిబంధనలు అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
మెడికల్ షాపులు పాటించాల్సిన నిబంధనలు
కొత్త మార్గదర్శకాల ప్రకారం.. రిజిస్టర్డ్ వైద్యులు ఇచ్చిన చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడే ఈ మందులను మెడికల్ షాపులు విక్రయించాలి. అలాగే ప్రతి విక్రయానికి సంబంధించిన వివరాలను ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయడంతో పాటు, ప్రిస్క్రిప్షన్ కాపీలు, విక్రయ రికార్డులను కనీసం మూడు సంవత్సరాల పాటు భద్రపరచాలి. అవసరమైతే ఔషధ నియంత్రణ అధికారులు పరిశీలించేందుకు ఈ రికార్డులను అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది.
Also Read:
ప్రశ్న రావణ్, ప్రకాశ్ రాజ్, జడ శ్రవణ్‌లు పెయిడ్ ఆర్టిస్ట్‌లు: జనసేన ఎమ్మెల్యే
నేడు ఒకరు ఆడించినట్టు ఆడే వ్యక్తిని కాదు: ఎంపీ ఈటల