Share News

సేంద్రియ వ్యర్థాలతో ఇంధన ఉత్పత్తికి ప్రోత్సాహం

ABN , Publish Date - Aug 07 , 2026 | 06:27 AM

దేశంలో సేంద్రియ వ్యర్థాల నుంచి ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది...

సేంద్రియ వ్యర్థాలతో ఇంధన ఉత్పత్తికి ప్రోత్సాహం

  • రూ.23,731 కోట్లతో ‘గోబర్‌ధన్‌’ పథకానికి ఆమోదం

న్యూఢిల్లీ, ఆగస్టు 6: దేశంలో సేంద్రియ వ్యర్థాల నుంచి ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పశువుల పేడ, వ్యవసాయ, ఆహార వ్యర్థాల నుంచి ఉత్పత్తి అయ్యే కంప్రెస్డ్‌ బయోగ్యా్‌స(సీబీజీ) నిల్వలను దేశంలో పెంచడమే లక్ష్యంగా రూపొందించిన గోబర్‌ధన్‌ పథకానికి కేంద్ర క్యాబినెట్‌ గురువారం ఆమోదం తెలిపింది. రూ.23,731కోట్లను ఈ పథకానికి కేటాయించింది. 2026-27 నుంచి 2035-36 ఆర్థిక సంవత్సరాల వరకు అమలు కానున్న ఈ పథకం కింద దేశవ్యాప్తంగా కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌(సీబీజీ) ప్లాంట్‌ల ఏర్పాటును ప్రోత్సహించనున్నారు. ప్లాంట్లు ఏర్పాటు చేసే వారికి ఈ పథకం కింద మూలధన సాయం, రుణ సదుపాయం కల్పిస్తారు.

వార్తలు కూడా చదవండి...

కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ

కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్

క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి ద‌యాక‌ర్

Read Latest Telangana News And AP News And National News

Updated Date - Aug 07 , 2026 | 06:27 AM