స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు ఎఫ్‌ఎస్‌ఎన్‌ఏఐ 9 నోటీసులు
ABN , Publish Date - Jul 12 , 2026 | 05:46 AM
గడువు దాటిన, పాడైపోయిన, కుళ్లిన, కలుషిత ఆహార ఉత్పత్తులను డెలివరీ చేసినట్టు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు...
న్యూఢిల్లీ, జూలై 11: గడువు దాటిన, పాడైపోయిన, కుళ్లిన, కలుషిత ఆహార ఉత్పత్తులను డెలివరీ చేసినట్టు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సంస్థకు భారత ఆహార భద్రత-ప్రమాణాల అథారిటీ(ఎ్‌ఫఎ్‌సఎ్‌సఏఐ) 9నోటీసులు జారీ చేసింది. ఆహార భద్రత ప్రమాణాల చట్టం-2006ను సంస్థ ఉల్లంఘించినట్టు అనేకమంది నుంచి తమకు ఫిర్యాదులు అందాయని ఈనెల 6న జారీ చేసిన నోటీసుల్లో ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ పేర్కొంది. కంపెనీ లైసెన్సు నంబరు కూడా తేడా ఉందని, ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐలో నమోదు కాని పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్నారని ఆక్షేపించింది. ఫిర్యాదుల పరిష్కారానికి తగిన చర్యలు లేవని గుర్తించినట్టు తెలిపింది. వీటిపై సమగ్ర వివరణ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఎంఎస్ఎంఈలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆ ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సీరియస్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News