ఎన్నికల అనంతర హింస.. టీఎంసీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు
ABN , Publish Date - May 31 , 2026 | 08:49 PM
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీపై దాడులు ఇప్పటికే సంచలనం సృష్టించగా, తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఖోకన్ దాస్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పోలీసులు అరెస్టు చేశారు.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీపై దాడులు ఇప్పటికే సంచలనం సృష్టించగా, తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఖోకన్ దాస్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్‌లో 2021లో జరిగిన ఎన్నికల అనంతర హింసాకాండకు సంబంధించి ఖోకన్ ఖాన్ పరారీలో ఉన్నారు. బర్దమాన్ దక్షిణ్ అసెంబ్లీ నియోజకవర్గానికి 2021 నుంచి 2026 వరకూ దాస్ ప్రాతినిధ్యం వహించారు.
హాండియా టౌన్ సమీపంలోని ఒక టోల్ వద్ద దాస్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసుల సాయంతో పశ్చిమబెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను బెంగాల్‌కు తరలించి మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. 2021 ఎన్నికల అనంతరం బర్దమాన్ దక్షిణ్ నియోజకవర్గంలో అల్లరిమూకలను రెచ్చగొట్టి పలువురు బీజేపీ నేతల ఇళ్లపై దాడులు చేయించారనే ఆరోపణలను దాస్ ఎదుర్కొంటున్నారు.
దాస్ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సందీప్ నందిపై గెలుపొందారు. దాస్‌కు 92,015 ఓట్లు రాగా, సందీప్ నందికి 82,910 ఓట్లు పోలయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాస్ బీజేపీ అధ్యర్థి బిశ్వా మిశ్రా చేతిలో 30,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దాస్‌కు 77,284 ఓట్లు రాగా, మిశ్రా 1,07,754 ఓట్లు గెలుచుకున్నారు. కాగా, దాస్ అరెస్టుపై టీఎంసీ ఇంకా స్పందించలేదు.
ఇవి కూడా చదవండి..
సువేందు క్యాబినెట్ విస్తరణ.. 35 మంది మంత్రులతో జూన్ 1న ప్రమాణస్వీకారం
మాజీ సీఎం మమత ఇంట్లో మీటింగ్.. ఎమ్మెల్యేల డుమ్మా?