ఉత్పాదకత, ఉపాధి కల్పనపై దృష్టి.. నిర్మలా సీతారామన్
ABN , Publish Date - Feb 01 , 2026 | 04:40 PM
21వ శతాబ్దం పూర్తిగా టెక్నాలజీ ఆధారితంగా నడుస్తోందని, అందువల్ల సాంకేతికతను సామాన్యుడిగా కూడా అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్ అన్నారు.
న్యూఢిల్లీ: సంస్కరణల ద్వారా స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధించేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని, ఉత్పాదకతను మెరుగుపరచడం, ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. వరుసగా తొమ్మదో సారి లోక్‌సభలో వార్షిక బడ్జెట్ (Budget 2026)ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. 85 నిమిషాల సేపు ప్రసంగించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, 21వ శతాబ్దం పూర్తిగా టెక్నాలజీ ఆధారితంగా నడుస్తోందని, అందువల్ల సాంకేతికతను సామాన్యుడిగా కూడా అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుందని అన్నారు. ఈ దిశగా టైర్ 2, టైర్ 3 నగరాల అభివృద్ధికి ఏటా రూ.1,000 కోట్ల చొప్పున కేటాయిస్తున్నాయని చెప్పారు. ఈ నిధులు ముఖ్యంగా సాంకేతిక ఆధారిక వృద్ధి, మౌలిక సదుపాయాలన కల్పన, పట్టణ ప్రణాళికను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని చెప్పారు. తద్వారా ఈ నగరాలు వేగవంతమైన ఆర్థికాభివృద్ధిని సాధిస్తాయని చెప్పారు.
సెమీ కండక్టర్ల రంగానికి రూ.40,000 కోట్లు
సెమీకండక్టర్ రంగంలో రెండు కీలకమైన ప్రకటనలను నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించారు. రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో రేర్ ఎర్త్ కేరిడార్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందుకోసం రూ.40,000 కోట్లు పెట్టుబడులు పెడతామన్నారు. మినరల్స్ విషయంలో ఇండియా స్వయంసమృద్ధి సాధించేందుకు ఈ చర్య ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పారు. ఇందువల్ల మేగ్నట్స్, రేప్ ఎర్త్స్‌పై మనం ఆధారపడటం తగ్గుతుందని అన్నారు.
అరుదైన వ్యాధుల చికిత్సకు అవసరమైన మందులు, ఆహార పదార్ధాల దిగుమతిపై బేసిక్ కస్టమ్స్ మినహాయింపును బడ్జెట్‌లో ప్రకటించామని, ఈ జాబితాలో అదనంగా ఏడురకాల అరుదైన వ్యాధులను చేర్చామని, ఇది రోగులకు పెద్ద ఉపశమనం కలిగిస్తుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. 17 రకాల క్యాన్సర్ నిరోధక ఔషదాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని రద్దు చేసినట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి
కేంద్ర బడ్జెట్ భేష్.. నిర్మలమ్మపై రామ్మోహన్ నాయుడు ప్రశంసలు..
బడ్జెట్ 2026: ‘ఖేలో ఇండియా మిషన్’కు కేంద్రం శ్రీకారం