ఆస్కార్‌కు భారత్ నుంచి ఎంపికైన మరాఠీ చిత్రం ‘గోంధల్’
ABN , Publish Date - Sep 18 , 2026 | 07:06 PM
ఈ ఏడాది ఆస్కార్ ఎంట్రీలలో ‘గోంధల్’ చిత్రం చోటుదక్కించుకుంది. భారత్ తరఫున వివిధ భాషలకు చెందిన 33 చిత్రాలు పోటీ పడగా.. వీటన్నింటినీ ఈ మరాఠీ చిత్రం పక్కకు నెట్టింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఈ ఏడాది ఆస్కార్- 2027 (99వ)పురస్కారాలలో భారత్ నుంచి పోటీపడడానికి మరాఠీ చిత్రం ‘గోంధల్’ ఎంపికైంది. భారత్ తరఫున వివిధ భాషలకు చెందిన 33 చిత్రాలు పోటీ పడగా.. వీటన్నింటినీ ఈ మరాఠీ చిత్రం పక్కకు నెట్టి.. ఈ అవకాశాన్ని దక్కించుకుంది. ఈ మేరకు ఆస్కార్ పోటీలకు దేశం నుంచి ‘గోంధల్’ చిత్రాన్ని నామినేట్ చేస్తున్నట్లు ఫిల్మ్ ఫేడరేషన్ ఆఫ్ ఇండియా(FFI)అధికారికంగా ప్రకటించింది.
సంతోశ్ ధవకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహారాష్ట్ర గ్రామీణ పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఎఫ్ఎఫ్ఐ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం 2025 నవంబర్‌లో విడుదలై అనేక పురస్కారాలను దక్కించుకుంది. కాగా.. ఈ చిత్రంలో కిషోర్ కదమ్, ఇషితా దేశ్‌ముఖ్, యోగేశ్ సొహానీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం సమకూర్చారు.
Also Read:
అమెజాన్ రిటర్న్ పాలసీతో భారీ మోసం.. వ్యాపారికి రూ.16.28 లక్షల నష్టం
ఈ 2 విషయాల్లో క్షమాపణ చెప్పినా తప్పులేదు