Share News

పీఎఫ్‌ వడ్డీ జమ ఆరంభం

ABN , Publish Date - Jul 09 , 2026 | 05:33 AM

తన ఖాతాదారులకు 2026 ఆర్థిక సంవత్సరం వడ్డీని జమ చేసే ప్రక్రియను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎ్‌ఫఓ) ప్రారంభించింది. బుధవారం కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్‌...

పీఎఫ్‌ వడ్డీ జమ ఆరంభం

  • 15 నాటికి ఖాతాల్లోకి: మన్సుఖ్‌ మాండవీయ

న్యూఢిల్లీ, జూలై 8: తన ఖాతాదారులకు 2026 ఆర్థిక సంవత్సరం వడ్డీని జమ చేసే ప్రక్రియను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎ్‌ఫఓ) ప్రారంభించింది. బుధవారం కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్‌ మాండవీడ మీడియాతో మాట్లాడుతూ, ఖాతాదారులు జూలై 15న తమ పీఎఫ్‌ ఖాతాలను వడ్డీ ఏమేరకు జమ అయిందో తనిఖీ చేసుకోవచ్చని తెలిపారు. ఈపీఎ్‌ఫఓ 2.01 సీఐటీఈఎ్‌స(సెంట్రలైజ్డ్‌ ఐటీ ఎనేబుల్డ్‌ సర్వీసె్‌స)ను అమలు చేసిందని, దీంతో సభ్యులు తమ ఖాతాలను ఆన్‌లైన్‌లో యాక్సెస్‌ చేయవచ్చని మంత్రి వివరించారు. కొత్త పోర్టల్‌తో సభ్యులకు సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా, వేగంగా అందుతాయని చెప్పారు. పీఎఫ్‌ వడ్డీ 8.25ుతో 34 కోట్ల సభ్యుల ఖాతాల్లో, సుమారుగా రూ.1.44 లక్షల కోట్లు జమ అవుతుందని వివరించారు. గతంలో పీఎఫ్‌ ఖాతాల వివరాలన్నీ డీసెంట్రలైజ్డ్‌గా ఉన్నాయని, ఖాతాదారుడు తన అభ్యర్థనలను సంబంధిత ప్రాంతీయ కార్యాలయంలోనే సమర్పించాల్సి వచ్చేదని తెలిపారు. తాజా మార్పుతో అన్ని సర్వీసులను ఆన్‌లైన్‌లోనే పొందవచ్చని, ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. అలాగే ఉద్యోగి కంపెనీ మారినప్పుడు సాగే ప్రక్రియ కూడా ఆన్‌లైన్‌లో ఆటోమేటిక్‌గా జరుగుతుందని మంత్రి వివరించారు. పదవీ విరమణ తరువాత పెన్షన్‌ ఏ ప్రాంతీయ కార్యాలయం నుంచి అయినా ప్రాసెస్‌ చేయవచ్చని, ఏ బ్యాంకు ఖాతా నుంచి అయినా పెన్షన్‌ పొందవచ్చని వివరించారు.

ఇవీ చదవండి:

ఎన్నికల విజయంపై న్యాయపోరు.. సీఎం విజయ్‌కు కొత్త చిక్కులు

ఢిల్లీ నుంచి సిలిగురికి 6 గంటల్లో.. పట్టాలెక్కిన బుల్లెట్‌ రైల్ ప్లాన్

Updated Date - Jul 09 , 2026 | 05:33 AM