త్వరలో ఈపీఎఫ్‌ఓ 3.0..యూనివర్సల్ పెన్షన్!
ABN , Publish Date - Jul 25 , 2026 | 07:00 AM
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ)లో సమూల మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జీతం తీసుకుంటున్న ఉద్యోగులతోపాటు గిగ్...
న్యూఢిల్లీ, జూలై 24: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ)లో సమూల మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జీతం తీసుకుంటున్న ఉద్యోగులతోపాటు గిగ్, ప్లాట్‌ఫాం వర్కర్లకు, అసంఘటిత కార్మికులకూ పెన్షన్ స్కీమ్ వర్తించేలా యూనివర్సల్ పెన్షన్ సిస్టమ్‌ను ఈపీఎఫ్‌ఓ 3.0 పేరుతో అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఇది అమల్లోకి వస్తే సామాజిక భద్రతా వ్యవస్థలో పెను మార్పులు రావడం ఖాయం. వివిధ పద్ధతుల్లో రిటైర్మెంట్ ఫండ్‌కు కంట్రిబ్యూట్ చేయడం, పెన్షన్‌ను ఎలా తీసుకోవాలన్న దానిపై స్వయంగా నిర్ణయించుకునే హక్కు ఉండడం ప్రతిపాదిత వ్యవస్థలో ఉండే అంశాలు. దీనిపై ఒక ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘ఇది పదవీ విరమణ వయస్సు వచ్చే వరకూ సంప్రదాయక ఈపీఎఫ్‌లానే మీ సొమ్మును పోగు చేస్తుంది. ఒకసారి పెన్షన్ వయస్సు వస్తే అది యాన్యుటీ రూపంలోకో, సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్(ఎస్‌డబ్ల్యూపీ)లోకో మారుతుంది. దీనిలో టార్గెట్ రిటైర్‌మెంట్ సమ్(టీఆర్‌ఎస్)ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు’ అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సమస్యలపై దృష్టి పెట్టండి.. జనసేన నేతలకు మంత్రి మనోహర్ సూచన
అమరావతి ఎన్‌జీఓ టవర్స్ నిర్మాణ పనుల్లో మరో ముందడుగు
Read Latest AP News And Telugu News