మరో 17 రాష్ట్రాలు, 5 యూటీల్లో మూడో దశ 'సర్'.. ఎన్నికల సంఘం అధికారుల ప్రకటన..
ABN , Publish Date - May 11 , 2026 | 09:19 PM
ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియను మరింత విస్తరించేందుకు ఎన్నికల సంఘం (ECI) సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండు దశల్లో ఓటర్ల సమగ్ర సవరణ (SIR) చేపట్టిన ఈసీ.. త్వరలో మూడో దశకు సిద్ధమవుతోంది.
ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియను మరింత విస్తరించేందుకు ఎన్నికల సంఘం (ECI) సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండు దశల్లో ఓటర్ల సమగ్ర సవరణ (SIR) చేపట్టిన ఈసీ.. త్వరలో మూడో దశకు సిద్ధమవుతోంది. ఈ దశలో మరో 17 రాష్ట్రాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు (SIR Phase III Election Commission).
ఇటీవల ఫలితాలు కూడా వెలువడడంతో మూడో దశ ఓటర్ల సమగ్ర సవరణను ఎన్నికల సంఘం ప్రారంభించబోతోంది. మొదటి రెండు దశల్లోనూ ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, కేరళ, గోవా, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, లక్ష్‌ద్వీప్‌లో 'సర్' ప్రక్రియను పూర్తి చేశారు. మొత్తంగా 99 కోట్ల మంది ఓటర్లలో 60 కోట్ల మంది ఓటర్లకు సంబంధించి వడపోత ప్రక్రియ పూర్తయిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు (Special Intensive Revision).
మిగిలిన 40 కోట్ల మంది ఓటర్లకు సంబంధించి 17 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మూడో దశ సవరణ ప్రక్రియను ప్రారంభించనున్నారు (Voter roll revision). నిజానికి ఈ మూడో దశ 'సర్' కోసం సిద్ధంగా ఉండాలని ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులకు ఈసీ ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీనే లేఖలు రాసింది. అయితే బీహార్, పశ్చిమబెంగాల్‌లో ఓటర్ల సమగ్ర సవరణపై పలు పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడంతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది.
ఈ వార్తనూ చదవండి:
ఇజ్రాయెల్‌కు షాకిచ్చిన హెజ్‌బొల్లా.. ఐరన్ డోమ్ యూనిట్ ధ్వంసం
భారత్‌కు పాక్ ఆర్మీ చీఫ్ వార్నింగ్