Share News

కేరళ మాజీ సీఎం ఇంట్లో ఈడీ సోదాలు

ABN , Publish Date - May 28 , 2026 | 05:29 AM

కేరళ మాజీ సీఎం విజయన్‌ నివాసంలో ఈడీ అధికారులు నిర్వహించిన సోదాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. తిరువనంతపురంలోని..

కేరళ మాజీ సీఎం ఇంట్లో ఈడీ సోదాలు

తిరువనంతపురం, మే 27: కేరళ మాజీ సీఎం విజయన్‌ నివాసంలో ఈడీ అధికారులు నిర్వహించిన సోదాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. తిరువనంతపురంలోని బేకరీ జంక్షన్‌లో ఉన్న విజయన్‌ అద్దె నివాసంతోపాటు కన్నూరు జిల్లాలో ఆయన కుటుంబానికి చెందిన నివాసం సహా పది ప్రాంతాల్లో బుధవారం ఉదయం ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే ఆయన మద్దతు దారులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. కోపోద్రిక్తులైన విజయన్‌ మద్దతు దారులు, సీపీఎం కార్యకర్తలు భద్రతా సిబ్బందిపై దాడికి దిగారు. సీపీఎం సీనియర్‌ నాయకులు జోక్యం చేసుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపేశారు. అయితే, ఈడీ అధికారులు తిరిగివెళ్తున్న సమయంలో వారి వాహనాలను అనుమానిత సీపీఎం కార్యకర్తలు ధ్వంసం చేశారు. కార్లపై రాళ్లురువ్వారు.

ఈ వార్తలు కూడా చదవండి..

న్యాయవాది మొయినుద్దీన్‌ హత్యకేసులో కీలక పరిణామం

లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్

For More AP News And Telugu News

Updated Date - May 28 , 2026 | 05:29 AM