ఉత్తరాఖండ్‌లో భూకంపం.. 4.2 తీవ్రతతో ప్రకంపనలు
ABN , Publish Date - Aug 10 , 2026 | 12:02 PM
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూమి కంపించడంతో పలు ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తెల్లవారుజామున 1:21 గంటల సమయంలో ప్రకంపనలు చోటుచేసుకోగా.. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. వివరాల్లోకి వెళితే...
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున 1:21 గంటల సమయంలో ప్రకంపనలు నమోదయ్యాయి. ఉత్తరకాశీ జిల్లాలోని బర్కోట్ తహసీల్ పరిధిలోని రాజ్‌గర్హి సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు సమాచారం. ప్రకంపనల ప్రభావం ఉత్తరకాశీతో పాటు బర్కోట్, పురోలా, మోరి, చిన్యాలిసౌర్, దుండాతో పాటు యమునా లోయలోని పలు ప్రాంతాల్లో కనిపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో పలువురు ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం.
భూప్రకంపనల కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. అయితే తెల్లవారుజామున ప్రకంపనలు చోటుచేసుకోవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, వివిధ ప్రాంతాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. భూకంప ప్రభావంతో ఎక్కడైనా భవనాలు లేదా ఇతర నిర్మాణాలకు నష్టం వాటిల్లిందా అనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రకంపనల అనంతరం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది.
ఇవి కూడా చదవండి
నటిపై అత్యాచారం.. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అరెస్ట్..
ఎయిర్‌ఇండియా ఫ్లైట్‌లో టర్బులెన్స్ ఉదంతం.. డోప్ టెస్టులో పైలట్ ఫెయిల్!