Share News

ఈ20 పెట్రోల్‌పై ముందుకే వెళ్తాం: కేంద్రం

ABN , Publish Date - Jul 12 , 2026 | 05:43 AM

ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌తో వాహనాలు దెబ్బతింటున్నాయని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ పెట్రోలియం, సహజవాయు శాఖ కీలక ప్రకటన చేసింది. 20ు ఇథనాల్‌..

ఈ20 పెట్రోల్‌పై ముందుకే వెళ్తాం: కేంద్రం

న్యూఢిల్లీ, జూలై 11: ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌తో వాహనాలు దెబ్బతింటున్నాయని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ పెట్రోలియం, సహజవాయు శాఖ కీలక ప్రకటన చేసింది. 20ు ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌(ఈ20) వల్ల వాహనాల మైలేజీ 3-5ు వరకు తగ్గుతున్న మాట నిజమేనని అంగీకరిస్తూనే.. ఈ20 పెట్రోల్‌ ఉత్పత్తిపై వెనక్కు తగ్గేది లేదని స్పష్టంచేసింది. పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపాలన్న నిర్ణయం హడావిడిగా తీసుకున్నది కాదని.. 2001 నుంచే ఈ పథకం అమలులో ఉందని తెలిపింది. దేశంలో ఇథనాల్‌ ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేకపోవటంతో ఇంతకాలం ఇది వేగంగా ముందుకు సాగలేదని శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొంది. ‘ఇథనాల్‌ పరిశ్రమకు కొన్నేళ్లుగా ప్రభుత్వ రంగ జాతీయ బ్యాంకులు ఏటా రూ.1 లక్ష కోట్ల వరకు రుణాలు ఇచ్చాయి. దేశవ్యాప్తంగా భారీగా మౌలిక వసతుల కల్పన కూడా జరిగింది. ఇప్పుడు ఇథనాల్‌ ఉత్పత్తి దేశంలో పూర్తిస్థాయిలో మొదలైంది. ఈ సమయంలో పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపే పథకాన్ని రద్దుచేస్తే ఆ పెట్టుబడులన్నీ ఏం కావాలి? ఆ పరిశ్రమలో పెట్టుబడి పెట్టిన కంపెనీలు, రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఈ20 పెట్రోల్‌తో 5 శాతం వరకు మైలేజీ తగ్గటం నిజమే అయినా.. ఇతర ప్రయోజనాలతో పోల్చితే అదేమంత పెద్ద నష్టం కాదు. ఈ 20 పెట్రోల్‌తో వాహనాల ఇంజన్లు దెబ్బతింటాయన్నది నిజం కాదు. అందువల్ల ఈ విషయంలో ముందుకే వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అని పేర్కొంది.

ఈ వార్తలు కూడా చదవండి...

ఎంఎస్ఎంఈలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఆ ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సీరియస్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 12 , 2026 | 05:43 AM