Share News

డీఎంకే-కాంగ్రెస్ పొత్తుపై సస్పెన్స్‌కు మరి కొద్ది గంటల్లోనే తెర

ABN , Publish Date - Mar 02 , 2026 | 09:42 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే-కాంగ్రెస్ చిరకాల పొత్తు ఈసారి కూడా కొనసాగుతుందా అనే సస్పెన్స్‌కు మరికొద్ది గంటల్లోనే తెరపడనుంది. సీట్ల కేటాయింపులో భాగంగా 25 అసెంబ్లీ సీట్లు, ఒక రాజ్యసభ సీటును కాంగ్రెస్‌కు డీఎంకే ఆఫర్ చేసింది. దీనిపై ఈనెల 3వ తేదీలోగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

డీఎంకే-కాంగ్రెస్ పొత్తుపై సస్పెన్స్‌కు మరి కొద్ది గంటల్లోనే తెర
MK Stalin with Rahul Gandhi

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే-కాంగ్రెస్ చిరకాల పొత్తు ఈసారి కూడా కొనసాగుతుందా అనే సస్పెన్స్‌కు మరికొద్ది గంటల్లోనే తెరపడనుంది. సీట్ల కేటాయింపులో భాగంగా 25 అసెంబ్లీ సీట్లు, ఒక రాజ్యసభ సీటును కాంగ్రెస్‌కు డీఎంకే ఆఫర్ చేసింది. దీనిపై ఈనెల 3వ తేదీలోగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తమిళనాడు నుంచి పోటీ చేసే రాజ్యసభ స్థానాలకు ఈనెల 5వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుండటంతో డీఎంకే ఈ డెడ్‌లైన్ విధించింది.


కాగా, 3వ తేదీ మంగళవారం సాయంత్రం లోగా కాంగ్రెస్ తన నిర్ణయాన్ని చెప్పకపోయిన పక్షంలో డీఎంకే మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక సీటును మరో భాగస్వామ్య పక్షమైన డీఎండీకేకు కేటాయించనుంది. కాంగ్రెస్ సానుకూలంగా స్పందిస్తే కాంగ్రెస్‌కు ఒక సీటు కేటాయించి, డీఎంకే రెండు స్థానాల్లో పోటీ చేస్తుంది.


41 సీట్లు కోరిన కాంగ్రెస్

కాంగ్రెస్ 2016 ఎన్నికల్లో కేటాయించిన 41 స్థానాలు ఈసారి కూడా కేటాయించాలని తొలుత డిమాండ్ చేసింది. క్రమంగా మెత్తబడింది. 25 సీట్లు నుంచి గరిష్టంగా 28 సీట్లు వరకూ ఇచ్చేందుకు డీఎంకే సుముఖత తెలిపింది. ఒక రాజ్యసభ సీటుకు కూడా ఆఫర్ ఇచ్చింది.


ఇవి కూడా చదవండి..

భారత్ ఎప్పుడూ శాంతియుత పరిష్కారాన్నే కోరుకుంటుంది: ప్రధాని మోదీ

సౌదీ, బహ్రెయిన్ నేతలకు మోదీ ఫోన్.. భారతీయుల భద్రతపై ఆరా

Updated Date - Mar 02 , 2026 | 09:50 PM