నీట్ పునర్నిర్వహణపై ధర్మేంద్ర ప్రధాన్ సమీక్ష
ABN , Publish Date - May 21 , 2026 | 04:54 AM
దేశవ్యాప్తంగా జూన్ 21న జరగబోయే నీట్-యూజీ పునర్నిర్వహణ పరీక్షను పారదర్శకంగా నిర్వహించడానికి కేంద్రం సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై కేంద్ర విద్యాశాఖ...
న్యూఢిల్లీ, మే 20: దేశవ్యాప్తంగా జూన్ 21న జరగబోయే నీట్-యూజీ పునర్నిర్వహణ పరీక్షను పారదర్శకంగా నిర్వహించడానికి కేంద్రం సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర భద్రతా సంస్థలు, ఇంటలిజెన్స్ అధికారులు హాజరైన ఈ సమావేశంలో.. పరీక్ష నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను ముందే గుర్తించి నివారణ చర్యలు చేపట్టడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఇదే సమయంలో మెటా, గూగుల్, టెలిగ్రాం వంటి సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫాం ప్రతినిధులతో ఒక సమాంతర సమావేశం జరిగింది. పరీక్షల సమయంలో అనామక గ్రూపుల ద్వారా పేపరు లీక్ అయినట్లు తప్పుడు కథనాలతో విద్యార్థులను, తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పరీక్షలకు సంబంధించి సోషల్ మీడియాలో, ముఖ్యంగా టెలిగ్రాం చానళ్లలలో తప్పుడు సమాచారాన్ని, పుకార్లను వ్యాప్తి చేస్తున్న ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కాగా, నీట్ పేపర్ లీక్ కేసులో అరెస్టయిన ఐదుగురు నిందితులకు ఢిల్లీ ప్రత్యేక కోర్టు జూన్ 2వరకు జ్యూడిషీయల్ కస్టడీ విధించగా.. మరో నిందితుడు శుభమ్ సీబీఐ కస్టడీని పొడిగించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు
కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం
స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు