పీవోకే నియోజకవర్గాల పునర్విభజన!
ABN , Publish Date - Nov 29 , 2026 | 05:53 AM
కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ (రెండో సవరణ) బిల్లులో పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న జమ్మూ కశ్మీర్ ప్రాంతానికి సంబంధించి కూడా కీలక నిబంధనలను పొందుపరిచింది
ఆ ప్రాంతం భారత్ నియంత్రణలోకి వస్తే ఏర్పాటుపై డీలిమిటేషన్ బిల్లులో ప్రతిపాదనలు
న్యూఢిల్లీ, నవంబరు 28: కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ (రెండో సవరణ) బిల్లులో పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న జమ్మూ కశ్మీర్ ప్రాంతానికి సంబంధించి కూడా కీలక నిబంధనలను పొందుపరిచింది. ఒకవేళ పాక్ ఆక్రమణ తొలగి ఆ ప్రాంతం భారత్ నియంత్రణలోకి వస్తే అక్కడి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు అనుసరించాల్సిన విధానాన్ని వివరించింది. ప్రతిపాదిత చట్టంలోని సెక్షన్ 3 (4) ప్రకారం ఆ ప్రాంతం ఆక్రమణ నుంచి విడిపోయినప్పుడు ఆ ప్రాంతంలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు భారత ఎన్నికల సంఘం డీలిమిటేషన్ కమిషన్‌గా వ్యవహరించనుంది. అయితే లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి ప్రస్తావన మాత్రం ఇందులో లేదు. ఇక ఈ నిబంధన అమలు పూర్తిగా ఆక్రమణ తొలగడంపైనే ఆధారపడి ఉంటుంది. మరోవైపు బిల్లులో ‘పాక్ ఆక్రమణలో ఉన్న ప్రాంతం’గా పేర్కొన్నారు తప్ప పీవోకే అనే పదాన్ని వాడలేదు. ఇప్పటికే ఆ ప్రాంతానికి కేటాయించిన 24 అసెంబ్లీ స్థానాలకు ఈ నిబంధన ఎలా వర్తిస్తుందనే దానిపై బిల్లులో స్పష్టత లేదు. ప్రతిపాదిత 50 శాతం సీట్ల పెంపు ఈ 24 స్థానాల కూడా వర్తిస్తుందా లేదా అన్నది స్పష్టం చేయలేదు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు
నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం