సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యంపై దాఖలైన పిల్.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు..
ABN , Publish Date - Jul 15 , 2026 | 01:36 PM
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని అత్యంత తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం.. కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని అత్యంత తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం.. కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆయనకు ఇప్పటివరకు అందించిన వైద్య సహాయం, తీసుకున్న చర్యలపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది (Sonam Wangchuk).
సోనమ్ వాంగ్‌చుక్ ప్రస్తుతం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందని, ఇప్పటికే సుమారు 8.5 కిలోల బరువు తగ్గారని, పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని పిల్ దాఖలైంది. ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైతే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని, అవసరమైతే ద్రవాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోర్టును పిటిషనర్ కోరారు (Sonam Wangchuk health).
ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించిన హైకోర్టు, వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఏ చర్యలు తీసుకున్నారో వివరించాలని కేంద్రాన్ని, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది (Delhi High Court). అలాగే ఆయనకు తక్షణ వైద్య సాయం అందించేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై కూడా వివరణ కోరింది. విద్యా వ్యవస్థలో జరిగిన అవకతవకలపై జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి మద్దతుగా వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌లోకి స్పెయిన్.. ఫ్రాన్స్‌పై 2-0తో ఘన విజయం