ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ
ABN , Publish Date - Nov 14 , 2026 | 04:54 AM
దేశ రాజధాని ఢిల్లీ శుక్రవారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత నగరంగా రికార్డయింది
లాహోర్‌ను అధిగమించిన వైనం
334 పాయింట్ల ఏక్యూఐతో ప్రమాదకర స్థాయి
న్యూఢిల్లీ, నవంబరు 13: దేశ రాజధాని ఢిల్లీ శుక్రవారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత నగరంగా రికార్డయింది. వాయు నాణ్యత ‘ప్రమాదకర స్థాయి’లో ఉన్నట్టు నమోదయింది. పొగ, మంచు కారణంగా ‘దృగ్గోచరత’ కూడా తగ్గి ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా సక్రమంగా కనిపించడం లేదు. ఇంతవరకు పాకిస్థాన్‌లోని లాహోర్ ఈ స్థానంలో ఉండగా, దాన్ని ఢిల్లీ అధిగమించింది. వాయు నాణ్యత సూచీ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్-ఏక్యూఐ) 50 ఉంటే దానిని మంచి వాతావరణంగా, ఆరోగ్యానికి హాని కలిగించని పరిస్థితిగా పరిగణిస్తారు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూ ఎయిర్ సంస్థ లెక్కల ప్ర కారం ఢిల్లీలో ఏక్యూఐ 334గా నమోదయింది. గాలిలోని విషపూరిత పదార్థాల ఆధారంగా దీనిని గణించింది. గాలి నాణ్యత ‘ప్రమాదకర స్థాయి’లో ఉందని, ఆ కారణంగానే ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నమోదయిందని పేర్కొంది. ప్రభుత్వ సంస్థ అయిన కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మాత్రం ఏక్యూఐ 403గా నమోదయిందని, దీనిని ‘తీవ్రమైన స్థాయి’గా పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. కాలుష్యాన్ని లెక్కించే విధానంలో తేడాలు ఉండడంతో భారత లెక్కల ప్రకారం ఏక్యూఐ పాయింట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ కాలుష్య తీవ్రత స్థాయి మాత్రం తక్కువగా నమోదయింది.
ఇవి కూడా చదవండి..
నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే సోదరుడి కొడుకు అరెస్టు