తమిళనాడులో ఒకే విడతలో పోలింగ్.. పరిశీలిస్తున్నామని చెప్పిన సీఈసీ
ABN , Publish Date - Feb 27 , 2026 | 03:09 PM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో నిర్వహించాలని పలు పార్టీలు సూచించినట్టు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. వారి విజ్ఞప్తులను వివిధ కోణాల నుంచి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో నిర్వహించాలని పలు పార్టీలు సూచించినట్టు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) తెలిపారు. వారి విజ్ఞప్తులను వివిధ కోణాల నుంచి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడే దీనిపై ఒక స్పష్టత ఇస్తామని అన్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై జ్ఞానేశ్ కుమార్ శుక్రవారంనాడు సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల రాష్ట్రంలో జరిపిన ఎస్ఐఆర్ ప్రక్రియ దేశానికే ఒక మోడల్‌గా నిలిచిందని, విజయవంతంగా ఈ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ఎస్ఐఆర్‌తో పెద్ద ఎత్తున ఓటర్లను జాబితా నుంచి తొలగించనున్నట్టు కొన్ని రాజకీయల పార్టీలు విమర్శించినప్పటికీ, ఓటర్ల జాబితా ప్రక్షాళన విషయంలో ఈసీ అధికారులు ఎంతో ప్రొఫెషనలిజం కనబరిచారని ప్రశంసించారు. ఇటీవల కాలంలో ఏమాత్రం పొరపాట్లకు తావీయకుండా బీహార్ ఎన్నికలు జరిగాయని, అంతకు మించి మరింత మెరుగ్గా తమిళనాడులో ఎన్నికలు నిర్వహిస్తామని, సరికొత్త రికార్డు సృష్టిస్తామని తెలిపారు.
కౌటింగ్ అయిన వారం వరకూ..
ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన ఏడు రోజుల వరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో వీవీపాట్ల స్లిప్పులను వెరిఫై చేసుకోవడానికి అభ్యర్థులను అనుమతిస్తామని సీఈసీ తెలిపారు. అయితే ఇందుకు కొంత మొత్తం చెల్లించాలని అన్నారు. ఈవీఎం రౌండ్లకు ముందు పోస్టల్ బ్యాలెట్లను రెండు రౌండ్లు కౌంటింగ్ జరుపుతామని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ మద్యం పాలసీ కేసు.. కేజ్రీవాల్‌కు భారీ ఊరట..
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. డీఎంకేలోకి పన్నీర్ సెల్వం