33 KG Gold Seize: విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత.. మహిళలు అరెస్ట్
ABN , Publish Date - Jan 01 , 2026 | 12:18 PM
ఇద్దరు మహిళల నుంచి దాదాపు 33 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని అధికారులు తెలిపారు.
ముంబై, జనవరి 01: నగరంలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి దాదాపు 32.79 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ బంగారం విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.19.15 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వివరించారు. ఆఫ్రికన్ దేశాల నుంచి ఈ ఇద్దరు మహిళలు వచ్చారని చెప్పారు. వీరిద్దరు వేర్వేరుగా విదేశాల నుంచి వచ్చారన్నారు.
ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో దిగిన వీరు.. తీరు అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రయాణికులను అదుపులోకి తీసుకుని.. తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. సదరు మహిళల లోదుస్తులతోపాటు లగేజీలో భారీగా బంగారం దాచినట్లు గుర్తించామని కస్టమ్స్ అధికారులు వివరించారు. వీరిద్దరిని అరెస్ట్ చేశామన్నారు. వీరిపై కేసు నమోదు చేసి.. విచారిస్తున్నామని కస్టమ్స్ అధికారులు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇలా చేయండి.. మీరే నెంబర్ వన్..
For More National News And Telugu News