Share News

ప్రజాస్వామ్య పరిరక్షణకు సోనియా పోరాటం భేష్‌

ABN , Publish Date - Nov 19 , 2026 | 12:55 AM

భారత్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణకు సోనియాగాంధీ అద్వితీయ పోరాటం చేశారని సీపీఐ జాతీయ నేత కె.నారాయణ కొనియాడారు. భారత్‌లో పుట్టకపోయినప్పటికీ...

ప్రజాస్వామ్య పరిరక్షణకు సోనియా పోరాటం భేష్‌

  • బీజేపీ ఆరోపణలకు ఆత్మకథతో సమాధానం: నారాయణ

న్యూఢిల్లీ, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : భారత్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణకు సోనియాగాంధీ అద్వితీయ పోరాటం చేశారని సీపీఐ జాతీయ నేత కె.నారాయణ కొనియాడారు. భారత్‌లో పుట్టకపోయినప్పటికీ... దేశం కోసం పోరాడుతూనే ఉన్నారని తెలిపారు. బుధవారం ఢిల్లీలో సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణతో కలిసి నారాయణ మీడియాతో మాట్లాడారు. సోనియా ఆత్మకథ పుస్తకంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. సోనియా అనుకుంటే ఇందిర, రాజీవ్‌ మరణాల తర్వాతే ఇటలీ వెళ్లిపోయేవారని తెలిపారు.

కానీ, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఇక్కడే ఉన్నారని చెప్పారు. దేశంపై ఆమెకు ఉన్న చిత్తశుద్ధికి ఇంతకంటే ఇంకేముంటుందని ప్రశ్నించారు. ఇండియాలో పుట్టని సోనియా దేశం కోసం పరితపిస్తుంటే, ఇక్కడే పుట్టిన మోదీ అమెరికా అడుగుజాడల్లో నడుస్తూ దేశానికి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ చేసిన వ్యక్తిత్వ హననానికి సోనియా తన ఆత్మకథతో సమాధానం చెప్పారన్నారు. యూపీఏకు మెజారిటీ వచ్చినప్పుడు అందరూ సోనియా ప్రధాని కావాలని కోరారని, కానీ ఆమె తిరస్కరించారని తెలిపారు. వైఎస్‌ హయాంలో సీపీఐకి రాజ్యసభ సీటు కావాలంటే, సోనియా వెంటనే అంగీకరించారని, కేవీపీకి ఇవ్వాల్సిన సీటును అజీజ్‌ పాషాకు ఇచ్చారన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్

పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్

Updated Date - Nov 19 , 2026 | 12:55 AM