Share News

సహకార జీవిత బీమా సంస్థ

ABN , Publish Date - Jul 07 , 2026 | 06:38 AM

సహకార సంఘాల వ్యాపార రంగాలను విస్తరించాలని నిర్ణయించినట్లు కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్‌ షా చెప్పారు. ఇందులో భాగంగా కొత్తగా ‘సహకార జీవిత బీమా సంస్థ’ను...

సహకార జీవిత బీమా సంస్థ

  • త్వరలోనే కొత్త కంపెనీ ఏర్పాటు

  • 500 నగరాలకు ‘భారత్‌ ట్యాక్సీ’

  • రెండేళ్లలో విస్తరిస్తాం: అమిత్‌ షా

న్యూఢిల్లీ, జూలై 6: సహకార సంఘాల వ్యాపార రంగాలను విస్తరించాలని నిర్ణయించినట్లు కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్‌ షా చెప్పారు. ఇందులో భాగంగా కొత్తగా ‘సహకార జీవిత బీమా సంస్థ’ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే సహకార శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘భారత్‌ ట్యాక్సీ’ని రాబోయే రెండేళ్లలో దేశంలోని మరో 500 నగరాలకు విస్తరించనున్నట్లు వెల్లడించారు. సహకార మంత్రిత్వ శాఖ ఐదో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో అమిత్‌ షా మాట్లాడారు. సహకార జీవిత బీమా సంస్థ ఏర్పాటు బీమా రంగంలో కోఆపరేటివ్‌ల వృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. దేశంలో ప్రస్తుతం 26 జీవిత బీమా కంపెనీలు ఉన్నాయన్నారు. ఇక, భారత్‌ ట్యాక్సీలో ప్రస్తుతం 6.37 లక్షల మంది డ్రైవర్లు, 35.77 లక్షల మంది రిజిస్టర్డ్‌ వినియోగదారులు ఉన్నారని, ఈ భారత్‌ ట్యాక్సీ సేవలను త్వరలోనే రాంచీ, పట్నా, గువాహటి, భోపాల్‌, కోల్‌కతా, ఇండోర్‌, నాగ్‌పూర్‌లతో ప్రారంభిస్తామని అమిత్‌ షా చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి...

మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 06:38 AM