Share News

రాజస్థాన్‌లో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం

ABN , Publish Date - Nov 21 , 2026 | 12:58 AM

రాజస్థాన్‌ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది.

రాజస్థాన్‌లో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం
congress

జైపూర్‌, న్యూఢిల్లీ, నవంబరు 20: రాజస్థాన్‌ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం... కాంగ్రెస్‌ 3,701 పంచాయతీ సమితి సీట్లలో గెలిచింది. అధికార పార్టీ బీజేపీ 2,181 సీట్లలో మాత్రమే గెలిచింది. అలాగే జిల్లా పరిషత్‌ సీట్లలో కాంగ్రెస్‌ 599 సీట్లలో నెగ్గగా బీజేపీ 301 సీట్లతో సరిపెట్టుకుంది.

ఇవి కూడా చదవండి..

ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఇంట్లోకి చొరబడి పెళ్లి చేసుకోవాలని డిమాండ్.. యువకుడిని కొట్టి చంపిన ఫ్యామిలీ

తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..

Updated Date - Nov 21 , 2026 | 01:00 AM