Share News

స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం.. లోక్‌సభలో ప్రారంభమైన చర్చ..

ABN , Publish Date - Mar 10 , 2026 | 01:02 PM

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం గురించి లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావెద్ లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ ప్రారంభమైంది.

స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం.. లోక్‌సభలో ప్రారంభమైన చర్చ..
Om Birla removal resolution

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం గురించి లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావెద్ లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ ప్రారంభమైంది. ఈ చర్చ కోసం పది గంటల సమయం కేటాయించారు. అనంతరం తీర్మానంపై ఓటింగ్ నిర్వహించనున్నారు (Om Birla removal resolution).


స్పీకర్ ఓం బిర్లా నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, ఆయన అధికార పార్టీ భాష మాట్లాడుతున్నారని తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావెద్ ఆరోపించారు. అనంతరం అవిశ్వాస తీర్మానంపై కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు చర్చను ప్రారంభించారు (Congress resolution Lok Sabha).


కాగా, స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం గురించి చర్చ జరుగుతున్న సమయంలో సభను నడిపేందుకు ప్రత్యేక సభాపతిని నియమించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి (Om Birla controversy). ఈ డిమాండ్‌కు కేంద్రం అంగీకరించింది. సీనియర్ ఎంపీ, చైర్ పర్సన్స్ ప్యానెల్ సభ్యుడు జగదాంబికా పాల్‌ను నియమించింది. ఆయన నేతృత్వంలో ప్రస్తుతం స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది.


ఇవి కూడా చదవండి..

ఇరాన్ యుద్ధం.. పెట్రోల్, గ్యాస్, ఎరువుల నిల్వలు సరిపోతాయా..

పుతిన్‌కు ట్రంప్ ఫోన్ కాల్.. ఇరాన్ యుద్ధం గురించి చర్చ..

Updated Date - Mar 10 , 2026 | 01:37 PM