కాక్రోచ్ జనతా పార్టీ వెబ్‌సైట్ తొలగింపు.. కేంద్రంపై అభిజీత్ దీప్కే మండిపాటు..
ABN , Publish Date - May 23 , 2026 | 04:10 PM
యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఫేమస్ సోషల్ మీడియా పేజీ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) కి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఎక్స్ అకౌంట్ నిలిపివేత, ఇన్‌స్టాగ్రామ్ హ్యాకింగ్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీ అధికారిక వెబ్‌సైట్ కూడా పనిచేయడం ఆగిపోయింది.
యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఫేమస్ సోషల్ మీడియా పేజీ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ - CJP) కి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఎక్స్ అకౌంట్ నిలిపివేత, ఇన్‌స్టాగ్రామ్ హ్యాకింగ్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీ అధికారిక వెబ్‌సైట్ కూడా పనిచేయడం ఆగిపోయింది. ఈ ఘటనపై స్పందించిన పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు (Cockroach Janta Party).
'ప్రభుత్వం కాక్రోచ్లకు ఎందుకు భయపడుతోంది? ఇది నియంతృత్వ ధోరణి' అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. అలాగే 'కాక్రోచ్లు ఎప్పుడూ చావవు' అంటూ కొత్త ప్లాట్‌ఫామ్‌పై పని చేస్తున్నామని తెలిపారు. తమను అణచివేసే కుట్ర జరుగుతోందని అభిజిత్ దిప్కే ఆరోపణలు చేశారు. 'కాక్రోచ్ జనతా పార్టీ' ఒక సోషల్ మీడియా ఉద్యమంగా ప్రారంభమైంది. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, పరీక్షల లీకులు, యువత సమస్యలపై సెటైరికల్ పోస్టులతో ఈ ఉద్యమం తక్కువ సమయంలోనే భారీ ఫాలోయింగ్ సంపాదించింది (CJP website down).
ఇన్‌స్టాగ్రామ్‌లో కోట్లాది మంది ఫాలోవర్లు రావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది (Political satire India). ఇటీవల పార్టీ ఎక్స్ అకౌంట్‌ను ఇండియాలో నిలిపివేయడం, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఈ పరిణామాలపై సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు వస్తున్నాయి. కొందరు దీన్ని భావ ప్రకటన స్వేచ్ఛపై దాడిగా విమర్శిస్తుండగా, మరికొందరు ఇది కేవలం వైరల్ రాజకీయ వ్యంగ్య ప్రచారమేనని అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
రాజ్యసభ సీటు అమ్ముకున్నారు.. ఆప్‌పై హర్భజన్ సంచలన ఆరోపణలు..
టెహ్రాన్‌కు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్.. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు..